ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చని ఛానెల్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దాదపుగా నెల రోజులుకు పైగా, మన రాష్ట్రంలోని సిటి కేబుల్ తో పాటు, ప్రభుత్వానికి చెందిన ఏపి ఫైబర్ నెట్ లో, ఏబీఎన్ ఛానెల్ తో పాటుగా, టీవీ5 ఛానెల్ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. అయితే దీని పై ప్రభుత్వం డైరెక్ట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. పలానా కారణంతో ఆపమని ఆదేశాలు ఇచ్చామని చెప్పలేదు. ఈ అనధికార బ్యాన్ పై, ఏబీఎన్, టీవీ5 ట్రిబ్యునల్ కు వెళ్ళాయి. టెలికాం వివాదాలు పరిష్కరించే అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద, ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ, ఈ రెండు ఛానెల్స్ ఫిర్యాదు చేసాయి. అయితే ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన విచారణలో టీడీశాట్‌ బాగా సీరియస్ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఛానెల్స్ విడుదల చెయ్యాలని, అలా చెయ్యకపోతే, రోజుకు రెండు లక్షల ఫైన్ కట్టాల్సి ఉంటుందని, ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

ban 17102019 2

అయితే, ఈ రోజు మరోసారి ఈ కేసు టీడీశాట్‌ లో విచారణకు వచ్చింది. టీడీశాట్‌ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో, ఏపీ ఫైబర్‌ నెట్‌ కోర్టు ధిక్కారణకు పాల్పడిందని టీడీశాట్‌ నిర్ధారిణకు వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం బలే వింత వాదనతో ముందుకు వచ్చింది. ఈ రెండు ఛానెల్స్ మేము కావాలని ఆపలేడని, సాంకేతిక కారణంగానే ఛానల్‌ ప్రసారాలు నిలిచిపోయాయని ఏపీ ఫైబర్‌ నెట్‌ వివరణ ఇచ్చింది. ఈనెల 22 లోపు ప్రసారాలు పునరుద్ధరిస్తామని టీడీశాట్‌‌కు, ఏపి ఫైబర్ నెట్ తెలిపింది. అయితే, ఏబిఎన్ ఛానెల్ విషయంలో, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో, ఏపీ ఫైబర్‌ నెట్‌కు జరిమానా విధింపును 22న నిర్ణయిస్తామని టీడీశాట్‌ పేర్కొంటూ, తదుపరి విచారణను అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.

ban 17102019 3

ఇక మరో పక్క, టీవీ5 విషయంలో, ఇప్పటికే ప్రభుత్వం పై ఫైన్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ నేటికి రూ.32 లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌ కు చెప్పింది. అయితే ఈ జరిమానా పై, ఏపి ఫైబర్ నెట్ వివరణ ఇచ్చింది. ఇప్పటికే సంవత్సరానికి రూ.150 కోట్లు నష్టాల్లో ఉన్నామని ఏపీ ఫైబర్ నెట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. జరిమానా చెల్లింపులో కొంత ఇబ్బందులు ఉన్నాయంటూ తప్పించుకునేందుకు చేసిన యత్నాన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఇక మరో పక్క, ఫైబర్‌ నెట్‌ చెబుతున్నట్టుగా సాంకేతిక సమస్య నిజమా కాదా అని..తేల్చడానికి టీడీశాట్‌ కమిటీని నియమించింది. ఈనెల 22 తర్వాత కూడా చానళ్ల పునరుద్ధరణ జరగకపోతే.. ఏపీ ఫైబర్‌ నెట్‌లో తనిఖీ చేయాలని కమిటీకి టీడీశాట్‌ చైర్మన్‌ ఆదేశించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read