ఒక మాజీ ముఖ్యమంత్రిని పది గంటల పాటు నిర్బంధించటం, ఎప్పుడో అరుదుగా చూస్తూ ఉంటాం. ఆయన ఏమీ ఆరాచకాం చేయటానికి వెళ్ళ లేదు. శాంతియుతంగా, శాంతికి మారు పేరు అయినా, గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపటానికి వస్తున్నారు. అదే ఆయన చేసిన పాపం. అందుకే ఈ నిర్బంధం. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ, వైసీపీ చేస్తున్న అరాచకాల పై చంద్రబాబు నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తానని పిలుపు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పోటీలో ఉన్న టిడిపి 43 వ వార్డుకు చెందిన అబ్ధ్యర్ది, తమకు లొంగలేదని, ఆయనకు కొన్నేళ్లుగా ఉన్న షాపుని కూల్చివేసిన సంఘటన ప్రదేశానికి వెళ్ళాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నిన్న చిత్తూరు జిల్లా నాయకులు, పోలీస్ పర్మిషన్ అడగగా, నిన్న రాత్రి పొద్దు పోయిన తరువాత, పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం, నిరసన దీక్షలో పాల్గుంటానని తేల్చి చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే హైడ్రామా నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వస్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. అంతే కాదు కార్యకర్తలను ఎవరినీ ఎయిర్ పోర్ట్ వద్దకు రానివ్వ లేదు. ఉదయం నుంచి ఇదే పనిగా వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసారు. పెద్ద స్థాయి నేతలను ఇంట్లోనే నిర్బందిన్చారు. వీటి అన్నిటి మధ్య తొమ్మిది గంటల సమయంలో చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

ఆయన ఫ్లైట్ దిగటంతోనే, పోలీసులు ఆయన్ను చుట్టు ముట్టారు. మీ పర్యటనకు అనుమతి లేదని అన్నారు. కరోనా, ఎన్నికల నిబంధనలు కారణంగా చెప్పారు. తనకు ఈసీ పర్మిషన్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చంద్రబాబు నిరసన దీక్షకు దిగారు. నేల పై కూర్చుని నిరసన తెలిపారు. తను జరుగుతున్న అన్యాయం పై ఎస్పీ, కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలనీ, నిరసన దీక్ష చేయాలని అన్నారు. ఎంతకీ పోలీసులు ఒప్పుకోలేదు. గంట, రెండు గంటలు, మూడు గంటలు, ఇలా పది గంటలు గడిచి పోయాయి. చంద్రబాబు నీళ్ళు కూడా ముట్టలేదు. భోజనం చేయలేదు. అలాగే పది గంటల పాటు దీక్ష కొనసాగించారు. ఆయన్ను ఏదో ఒక ఫ్లైట్ లో తిప్పి పంపించాలని పోలీసులు చూసినా వల్ల కాలేదు. చివరకు జాయింట్ కలెక్టర్, ఎస్పీ వచ్చి, సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్ కు వెళ్ళాలని, అదే చివరి ఫ్లైట్ అని, మీరు ఇక్కడే ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, బలవంతంగా ఫ్లైట్ ఎక్కించటంతో, చివరకు 10గంటల ఉత్కంఠ కు తెర పడింది. అయితే చంద్రబాబు మాత్రం, తాను అనుకున్నట్టే, అధికార పార్టీ అరాచకాలను ప్రజలు చెప్పగలిగారు. అలాగే దీక్ష కూడా చేసారు. ఆయన్ను అలా వదిలేసి ఉంటే, ఒక రాజకీయ పార్టీ ప్రసంగం అయ్యేది, కానీ ఇప్పుడు అడ్డుకుని, ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసి, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read