తెలంగాణాకు కొత్తగా వచ్చిన గవర్నర్, మొదటి రోజే కేసిఆర్ కు చుక్కలు చుపించారనే వార్తలు వస్తున్నాయి., ఆమె వచ్చిన మొదటి రోజే మంత్రివర్గ విస్తరణ చెయ్యటంతో, దానికి ముందే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందర రాజన్‌ను కొత్త గవర్నర్ గా నియమించింది. అయితే సెప్టెంబర్ 1 కంటే ముందే కేసీఆర్‌కు కొత్త గవర్నర్‌ వస్తున్నారన్న సమాచారం రావటంతో, నరసింహన్ వెళ్ళే లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తాల కోసం చూస్తూ ఉండగా, సెప్టెంబరు 8న దశమి రోజు మంచి ముహూర్తం ఉండటంతో అందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే గవర్నర్‌ మార్పు ప్రకటన వచ్చింది. సెప్టెంబరు 8న నరసింహన్‌తో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పదో తేదీన ప్రగతిభవన్‌లో నరసింహన్ కు ఘనంగా వీడ్కోల విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

kcr 10092019 2

అందుకు తగ్గట్టే నరసింహన్‌ కూడా 11న మంచి రోజని, ఆ రోజున రాజ్‌భవన్‌ను వీడాలని అనుకుని, అదే విషయాన్ని కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన జరిగిన విలేకరులతో ఇష్టాగోష్టిలో కూడా నరసింహన్‌ తాను మరో వారం ఉంటున్నట్లు చెప్పారు. అయితే, ఈలోపే కొత్త గవర్నర్‌ తమిళిసై సెప్టెంబరు 8న వచ్చి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తానని సమాచారం వచ్చింది. అయితే కేసిఆర్ ఆమెతో మాట్లాడి, నరసింహన్‌ 11 వరకు ఉండాలని అనుకుంతున్నారని చెప్పటంతో, ఆమె కూడా సరే అన్నారు. అయితే ఏమైందో ఏమో కాని, హఠాత్తుగా ఆమె 8నే తాను రాష్ట్రానికి వస్తున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందించారు. దాంతో ఇక చేసేది ఏమి లేక, 7వ తేదీనే నరసింహన్‌ రాజ్‌భవన్‌ను ఉన్నట్టు ఉండి వీడాల్సి వచ్చింది.

kcr 10092019 3

దీంతో ఏడో తేదీనే, గవర్నర్‌కు విందు ఏర్పాటు చేశారు. అయితే అదే రోజున మంత్రి వర్గ విస్తరణ పెట్టించి, నరసింహన్ తోనే, ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని కేసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. అయితే, కొత్త గవర్నర్‌ వస్తుండగా, దిగిపోతున్న గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించడం మంచిది కాదని కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో, కేసిఆర్ ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఈలోపు తమిళిసై రావటంతోనే, మంత్రి వర్గ విస్తరణ అని ఆమెకు చెప్పటంతో, తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఎందుకు, మరో మంచి ముహూర్తంలో చేసుకోండి అని ఆమె కోరగా, చేసేదేమీ లేక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో తమిళిసై సరేనన్నట్లు సమాచారం. మొన్నిదాక నరసింహన్ తో ఆడింది అటగా కొనసాగిన కేసిఆర్, తమిళిసై పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్త కావడం, మొండిమనిషిగా ఆమెకు పేరుండటంతో సీఎం-గవర్నర్‌ సంబంధాలు అంత సాఫీగా ఉండవని మొదటి నుంచే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆమె తన మొండి తనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తొలిరోజే చూపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read