ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దులో, తెలంగాణా ప్రభుత్వం ఏపి నుంచి వెళ్ళే అంబులెన్స్ లను అడ్డుకోవటం పై, ఈ రోజు సుజనా చౌదరి సన్నిహితులు వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై, ఈ రోజు తెలంగాణా హైకోర్టులో దాదాపుగా రెండు గంటల పాటు విచారణ జరిగింది. దీని పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో ఎలాంటి అంబులెన్స్ లు ఆపకూడదు అంటూ, తెలంగన ప్రభుత్వానికి చెప్తూ, తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన సర్క్యలర్ ని నిలిపుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అంటూ, ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి అంబులెన్స్ లు ఆపవద్దు అని తెలంగాణా పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ హైవేల పై వాహనాలు ఆపటం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని, కేంద్రానికి ఆ అధికారం ఉంటుందని, హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషనర్ తరుపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మెడికల్ ఇన్ఫ్రా కూడా కేంద్ర పరిధిలోని అంశం అని, ఆర్టికల్ 11 ప్రకారం, ఇలా ఆపటం కుదరదు అని, అలాగే సుప్రీం కోర్టులో దీని పై, అనేక డైరక్షన్స్ ఉన్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.

hc 14052021 2

అయితే తెలంగాణా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జెనెరల్ వాదనలు వినిపిస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారని, ఇక్కడ ప్రతి ఒక్కరికీ వైద్యం అందటం కష్టం అని, ఇక్కడ ప్రజలకు వైద్యం అందటం కష్టం అవుతుందని వాదించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ ఉన్న వారిని రాష్ట్రం లోకి రానివ్వటం లేదని, అలాగే ఇక్కడకు అంబులెన్స్ లలో వచ్చే వాళ్ళు అందరూ పాజిటివ్ ఉన్న వారే అని, వారిని అడ్డుకునే హక్కు తమకు ఉందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అయితే దీని పై కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అందరికీ బ్రతికే హక్కు ఉందని అన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం, ప్రాణాలు కాపాడుకునే హక్కు ఈ దేశంలో ఉందని, దాన్ని మీరు హరించలేరని అన్నారు. మేము ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఎందుకు ఆపారు అంటూ ఆగహ్రం వ్యక్తం చేసారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వెంటనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరే విధంగా కూడా, కొత్త ఆదేశాలు ఇవ్వకూడదు అంటూ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read