ఏసిబి డీజీ గా అవనీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఆర్‌.పి ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్‌.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆర్.పి. ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01 న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు నిర్వహించారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఆర్పీ ఠాకూర్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాఠూక్ మెడల్ పొందారు. ప్రస్తుతం ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి ఆర్.పి.ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఠాకూర్ సాబ్ ఆల్ ది బెస్ట్! మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఎన్నో ఉన్నాయి... ప్రత్యేక వాదులు...రాజకీయ ముసుగులోని అత్యంత అవనీతి పరులు...కేంద్రం వత్తాసుతో కుట్రదారులు.. కులాల కుంపట్లు...ప్రాంతాల మధ్య విద్వేషాలు...అల్లర్లు...అలజడులకుప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న క్లిష్ట పరిస్దితుల్లో బాధ్యతలు చేపడుతున్న ఠాకూర్ గారు, ముఖ్యమంత్రి మీమీద ఉంచిన బాధ్యత నమ్మకం నిలబెడతారని, నవ్యాంధ్ర ప్రగతిలో మీ మార్క్ చూపిస్తారు అని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read