తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై, గత 5 ఏళ్ళుగా ఎలాంటి ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో లోకేష్ పై, పని గట్టుకుని, ఒక బ్రాండింగ్ చేసారు. లోకేష్ మంత్రిగా రోడ్లు వేసినా, ఐటి కంపెనీలు తెచ్చినా, ఎలెక్ట్రోనిక్ కంపెనీలు తెచ్చినా, అవి మాత్రం ప్రజలకు గుర్తు లేకుండా, కేవలం నెగటివ్ ప్రచారం మాత్రమే గుర్తుకు వచ్చేలా, వైసీపీ సోషల్ మీడియాలో, లోకేష్ పై బ్రాండింగ్ చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక, ఛానెల్ అయిన సాక్షి పాత్ర కూడా ఇందులో ఎంతో ఉంది. ప్రతి తెలుగుదేశం నాయకుల మీద అసత్యాలు, బురద జల్లినట్టే, లోకేష్ పై కూడా, ఇలాంటి అసత్య కధనాలే వేసి నమ్మించే ప్రయత్నం చేసారు. అయితే, ఇందులో తెలుగుదేశం తప్పు కూడా ఉంది. ఎప్పటికప్పుడు, ఆ ప్రచారం తిప్పి కొట్టకుండా, వాళ్ళు ప్రచారం చేసింది నిజం, అని ప్రజలు నమ్మేలా, వీళ్ళు సైలెంట్ గా ఉండి పోయారు.

lokesh 10122019 2

అయితే, ఈ పరంపర, ఎన్నికల తరువాత కూడా జరుగుతుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా, ఇంకా అసత్య కధనాలతో, నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సాక్షిలో ఒక కధనం వచ్చింది. "చినబాబు చిరు తిండి ఖర్చు 25 లక్షలు" అంటూ ఒక కధనం సాక్షి పేపర్ లో ప్రసారం అయ్యింది. అందులో కేవలం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో, లోకేష్ చిరు తిళ్ళు కోసం, 25 లక్షలు ఖర్చు అయ్యింది అంటూ అర్ధం వచ్చేలా ఒక బొమ్మ వేసి, వార్తా రాసారు. అందులో అనేక డేట్లు వేసి, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంతా అంటూ ఖర్చు చూపించారు. అయితే, నిజానికి, ఆ తేదీల్లో, లోకేష్ అక్కడ లేనే లేరు. అయినా, లోకేష్ ఉన్నట్టుగా ప్రచారం చేసి, ఒక కధనం అల్లారు. దీని పై లోకేష్ అప్పుడే అన్ని ఆధారాలతో, సోషల్ మీడియాలో స్పందించారు.

lokesh 10122019 3

ఇదే కధనాన్ని, డెక్కన్ క్రానికల్, ది వీక్ అనే పత్రికలు కూడా, సాక్షి న్యూస్ చూసి రాసాయి. అయితే, సాక్షి, డెక్కన్ క్రానికల్, ది వీక్ పత్రికలకు, నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కధనాల పై వాస్తవం ఇది అని, దీని పై మీరు సవరించుకోక పొతే, పరువు నష్టం దావా వేస్తానని ఆ నోటీస్ పంపించారు. ఈ నోటీస్ కు రియాక్ట్ అయిన, ది వీక్ , ఆ రోజు వేసిన కధనం తప్పు అని మా దృష్టికి వచ్చిందని, దీనికి క్షమాపణ చెప్తున్నామని, rejoinder ఇచ్చారు. అయితే సాక్షి, డెక్కన్ క్రానికల్ మాత్రం ఇంకా స్పందించలేదు. వారికి వంద కోట్ల దాకా, దావా పంపించే ఆలోచనలో లోకేష్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు కధనాలు రాస్తే, చూస్తూ ఊరుకోం అని, అంటున్నారు. మరో పక్క తెలుగుదేశం క్యాడర్ ఈ విషయం పై సంతోషంగా ఉన్నా, ఇలా అధికారంలో ఉన్నప్పుడే ఉండి ఉంటే, వ్యవహారం ఇంత వరకు వచ్చేది కాదని బాధ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read