కుంభకోణం అనే పదానికే కొత్త నిర్వచనం చెబుతున్న జగన్ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాదు అది అడ్జెస్ట్ మెంట్ అని ప్రభుత్వం చెప్తుంది. తాజాగా ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్త చూసి ప్రజల దిమ్మ తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాగ్ కి సమర్పించిన లెక్కల్లో ఏకంగా రూ.30 వేల కోట్లు మాయం అయ్యాయి. ఇది చరిత్రలోనే కానీ వినీ ఎరుగని బరితెగించిన కుంభకోణం. గతంలో రూ.48 వేల కోట్లు లెక్కలు లేవని కాగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అది తేలక ముందే, ఇప్పుడు మరో రూ.30 వేల కోట్లు మాయం అనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా రూ.78 వేల కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. మరి ఈ సొమ్మంతా ఎక్కడికి చేరుతోందో ? ఢిల్లీ ప్రభువులకన్నా తెలుస్తోందో లేదో ? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారో! అసలు కాగ్ ఎందుకు చూసీ చూడనట్టు వదిలేస్తుందో, ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read