ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు గుర్తించి, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. కాపు సామజికవర్గ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. అయినా సరే, మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయన కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడిలో, లేకపోతే మరే కారణమో కాని, ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన దగ్గర నుంచి అనేక అవమానాలు ఎదుర్కుంటునే ఉన్నారు. పోనీ కాపు నాయకుడు అని చెప్పుకుంటూ, కాపులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ఎత్తేసినా నోరు పెగలలేదు. కాపు కార్పొరేషన్ పూర్తిగా సైలెంట్ అయిపోయినా నోరు ఎత్తలేదు. అమ్మ ఓడి కోసం, నిధులు అన్నీ మళ్ళిస్తున్నా, మాట్లాడలేదు. ఇలా కాపులకు ఎంత అన్యాయం జరుగుతున్నా, తోట త్రిమూర్తులు పట్టించుకోలేదు.

పోనీ వైసీపీలో ఆయనకు గుర్తింపు ఉందా అంటే అది కూడా లేదు. ఈ రోజు ఏకంగా చెప్పు దెబ్బలు తిన్నారు, తోట త్రిమూర్తులు. ఈ రోజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో ఆత్మీయ సమావేశం జరిగింది. తోట త్రిమూర్తులు, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు కూడా హాజరు అయ్యారు. అయితే, వైవీ సుబ్బారెడ్డి, తోట త్రిమూర్తులు ఒకే కారులు వచ్చారు. అయితే, తోట త్రిమూర్తులు కారు దిగగానే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గంలోని ఒక వ్యక్తి, తోట త్రిమూర్తుల పై, చెప్పుతో బాదుతూ దాడి చేసారు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. సొంత పార్టీలోనే, ఇలా సీనియర్ నాయకుడు, కాపుల్లో మంచి పేరు ఉన్న తోట త్రిమూర్తుల పై, ఏకంగా చెప్పుతో దాడి చెయ్యటం సంచలనంగా మారింది.

మరో పక్క, తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వేణు వర్గం, చించి వేసి తగులబెట్టింది. మొత్తంగా, ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన వారు, వైవీ సుబ్బారెడ్డి కారుని అడ్డుకుని నినాదాలు కూడా చేసారు. తోట త్రిమూర్తులుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ, నినాదాలు చేసారు. ఇదే సందర్భంలో ఫ్లెక్స్ లు తగలు బెట్టటం, చెప్పులతో దాడి చెయ్యటం, అక్కడే ముగ్గురు మంత్రులు, ఒక టిటిడి చైర్మెన్ ఉండటంతో, వైసీపీలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది అంటూ, క్యాడర్ నిరుత్సాహంతో ఉండి పోయింది. మొత్తంగా టిడిపిలో దర్జాగా బ్రతికిన తోట త్రిమూర్తులు, వైసీపీలో చేరి, చెప్పు దెబ్బలు తిన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read