చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా టార్గెట్ గా, వైసీపీ పావులు కదుపుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, కేవలం 23 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్యను, 17 కంటే తక్కువకు పడేస్తే, చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదని, తద్వారా చంద్రబాబుకి, మరింత అవమానం చేసి, ఆనంద పడవచ్చని వైసీపీ ఆలోచనగా ఉంది. ఈ పని ఎప్పుడో చెయ్యాల్సి ఉండగా, జగన్ ఆవేశంలో ఇచ్చిన స్పీచ్ అడ్డు వచ్చింది. అదే రాజీనామా చేసి పార్టీలోకి రావాలి అనే మాట. అయితే, ఇప్పుడు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే వైసీపీ స్తానిక సంస్థలు కూడా వాయిదా వేస్తూ వస్తుంది. సహజంగా, ఎవరైనా గెలవగానే, రెండు మూడు నెలల్లోనే, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి పోతారు. కేసీఆర్ అక్కడ చేసింది కూడా అదే. కాని ఇక్కడ జగన్ మాత్రం, ఆరు నెలలు అయినా స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, జనవరిలో అని చెప్తున్నా, ఇప్పుడప్పుడే అయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

cbn 041220192

ఇందుకు కారణం ప్రజా వ్యతిరేకత. అయితే స్థానిక సంస్థలే ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట, ఉప ఎన్నికలు అంటే, వైసీపీ ఆలోచిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వారిని, తటస్థంగా ఉంచాలని చూస్తుంది. వారిని డైరెక్ట్ గా పార్టీలో కలుపుకోకుండా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా ఉండేలా వ్యూహం సిద్ధం చేసింది. ఇందుకు ముందుగా, వల్లభనేని వంశీని రంగంలోకి దింపారు. తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిగా, వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వంశీ. అయితే వంశీ పచ్చి బూతులతో పడిపోవటంతో, తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో వంశీ అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారని, ఇదే వ్యూహాన్ని, మిగతా జంప్ కొట్టే ఎమ్మెల్యేలతో చేపించాలని, వైసీపీ స్కెచ్ వేసింది.

cbn 04122019 3

తాజాగా డిసెంబర్ 9 అసెంబ్లీ సెషన్స్ కు ముందే, మరో ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలను లాగే ప్లాన్ వేసారు. ఈ ముగ్గురు కూడా ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలని తెలుస్తుంది. మొత్తం ప్రకాశంలో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురిని లాగేసారని, ఈ రోజు వారు జగన్ సమక్షంలో, వైసీపీలో చేరుతున్నారని ప్రచారం సాగుతుంది. ఇందుకు సంబంధించి, ఇప్పటికే గొట్టిపాటి రవి, క్వారీల పై రైడ్స్ జరిపించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, వైసీపీలో చేరుతారని, మరో వారంలో, ఇంకో ముగ్గురు నలుగురుని లాగుతరాని, ప్రచారం జరుగుతంది. అయితే చంద్రబాబు మాత్రం, ఇవన్నీ లైట్ గా తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా పొతే ఏమి అవుతుంది, పోనివ్వండి, ప్రజలతో ఉందాం, ప్రజల్లోనే తేల్చుకుందాం అంటూ చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read