అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుపతికి వచ్చారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. నడకమార్గం ద్వారా ఆయన తిరుమలకు చేరుకున్న అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత 3.35గంటలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి పాదయాత్రగా బహిరంగసభ ఏర్పాటు చేసిన తారకరామస్టేడియంకు 5గంటలకు చేరుకుంటారు.

rg 22022019

బహిరంగసభలో పాల్గొని 6గంటలకు తారకరామస్టేడియం నుండి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ తిరుపతి నుండి కాలినడకన తిరుమలకు చేరుకుంటారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అయితే ఆయనకు కాలిబాటలో భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో అలిపిరి మార్గాన కాలినడకన వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కాని రాహుల్ గాంధీ మాత్రం, దేవుడు దగ్గర కూడా ఇలాంటి భయాలు ఎందుకు, నేను నడక మార్గం ద్వారా వెళ్తాను అని చెప్పి, నడక మార్గం ద్వారా కొండ పైకి ఎక్కుతున్నారు. అయితే ఈ పరిణామంతో పోలీస్ యంత్రాంగం అలెర్ట్ అయ్యింది..

rg 22022019

వెంటనే బద్రత కట్టుదిట్టం చేసారు. రాహుల్ గాంధీ ఇలా షాక్ ఇస్తారనుకోలేదని, వెంటనే బద్రత పెంచాలని, పోలీసులకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈ నెల 19 నుంచి 13 జిల్లాల్లో ప్రత్యేకహోదా భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఈ రోజు రాహుల్‌గాంధీ వస్తున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు చేస్తానని ప్రధాని మోడీ మాట ఇచ్చి తప్పిన ప్రాంతమైన తిరుపతిలోనే రాహుల్‌ ప్రత్యేకహోదా భరోసా యాత్ర లో పాల్గొననుండడం విశేషం.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read