వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కక్ష సాధింపు కవల పిల్లలు అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ కక్ష సాధింపు ఎలా ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రజా వేదిక. జగన్ మోహన్ రెడ్డి రాగానే ప్రజా వేదికను రాత్రికి రాత్రి కుల్చేసారు. ప్రజలకు ఉపయోగపడే ప్రజా వేదిక, కేవలం చంద్రబాబు తన ఆఫీస్ గా అడిగారని, కూల్చి పడేసారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మూడేళ్ళు అవుతున్నా, ఇప్పటికీ అక్కడ ప్రజా వేదిక దగ్గర ఉన్న శిధిలాలు, తొలగించలేదు. కేవలం కూల్చి, అన్నీ అక్కడే పడేసారు. ప్రతి రోజు చంద్రబాబు అది చూడాలి అని జగన్ కోరిక అంట. కక్ష సాధింపు అలా ఉంటుంది. మరో ఉదాహరణ. మనం అప్పుల మీద బ్రతకటానికి అలవాటు పడిపోయాం. అప్పులు అడుగుతుంటే, బ్యాంకులు ఇవ్వటం లేదని, ఏకంగా మునిసిపాలటీ వాళ్లతో మాట్లాడి, బ్యాంకుల ముందు చెత్త పోయించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇలా చేస్తే, ఇక ఏమి మాట్లాడాలి ? కేంద్రం ఆధీనంలో ఉన్న బ్యాంకులు ముందు చెత్త పోసినా, కేంద్రం చూసి చూడనట్టు వదిలేసింది. అదే ఇప్పుడు, ఈ కక్ష సాధింపు ఏకంగా ఎయిర్ పోర్ట్ వరకు వచ్చింది. ఆ రోజే కేంద్రం గట్టిగా ఉండి ఉంటే, ఇక్కడ వరకు వచ్చే వారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఎయిర్ పోర్ట్ విషయంలో, అసలు ఏమి జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.

tirupati 12012022 2

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, అలాగే తిరుపతికి డిప్యూటీ మేయర్ కూడా అయిన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎయిర్ పోర్ట్ కు నీళ్ళ సరఫరా నిలిపివేశాడు. సిబ్బంది కాలనీకి నీళ్ళు ఆపేసాడు. బయట నుంచి ట్యాంకర్లు తెచ్చుకుంటుంటే, మరమ్మత్తుల పేరుతో రోడ్డు తవ్వేసాడు. దీంతో నీళ్ళు లేక ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అసలు సార్ గారికి కోపం ఏమిటి అంటే, బొత్సా వస్తున్నారని స్వగతం పలకటానికి మందితో ఎయిర్ పోర్ట్ కు వెళ్తే, అంత మందిని లోపలకు పంపించమని సిబ్బంది చెప్పటంతో, సార్ గారికి కోపం వచ్చింది. నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి, చివరకు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే పైప్ లైన్ ఆపేశారు. అదేమంటే రిపేర్ అంటున్నారు. విషయం ఎమ్మెల్యే భుమనకు చెప్పినా, కొడుకుని సమర్ధించుకు రావటంతో, ఎయిర్ పోర్ట్ సిబ్బంది షాక్ అయ్యారు. ఈ విషయం కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లారు. మొత్తానికి,మరోసారి, తమ సత్తా ఏమిటో చూపించారు, వైసీపీ నేతలు. తమ జోలికి వస్తే ఇలాగే ఉంటుందని, మరో సాంపుల్ చూపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read