తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో ఓటమిభయంతో వైసీపీనేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని, ఆ భయంతోనే పోలీసులకు ఎన్నికల అధికారులకు తప్పు డుఫిర్యాదులుచేస్తున్నారని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నపార్టీ ప్రజలమనస్సు గెలిచి, ఓటర్ల అభిమానంతో గెలిచే ప్రయత్నాలుచేయకుండా, తెలుగు దేశాన్ని, ఆపార్టీనేతలను ఇబ్బందిపెట్టి గెలవాలని చూడటం ముమ్మాటికీ ఓటమిభయంతోనే అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. తిరుపతిఉపఎన్నికలో వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, గడికోట శ్రీకాంత్ రెడ్డి పకడ్బందీగా వాలంటీర్ల సమావేశం నిర్వహించాడన్నా రు. ఎవరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి సమావేశ సమాచారాన్ని బయటకుతెలియచేస్తారన్నభయంతో వాలంటర్లు ఫోన్లస్విచాఫ్ చేయించాక సమావేశానికి పిలవడం జరిగిందన్నారు. వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయడం, వారిద్వారానే స్లిప్పులు పంపిణీచేయడం చేశా రని, చివరకు వారిని అడ్డంపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. వాలం టరీ వ్యవస్థ స్థానికఎన్నికల్లో తీవ్రంగా దుర్వినియోగా లకు పాల్పడిందన్నారు. ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పినా, అధి కారపార్టీనేతలు సిగ్గులేకుండా వారిసేవలను ఉపయోగిం చుకుంటున్నారని టీడీపీనేత మండిపడ్డారు. నవ్విపోదు రుగాక నాకేటి సిగ్గు అన్న ఆలోచనతో ఉన్నవారు పద్ధ తులు మార్చుకోరని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరని ఆయన తేల్చిచెప్పారు. శ్రీకాంత్ రెడ్డి ఎన్నిరహస్య సమా వేశాలుపెట్టినా, వ్యవస్థలను దుర్వినియోగంచేయాలని చూసినా అధికారపార్టీ ఓటమిఖాయమన్నారు. తెలుగు దేశం విజయంకోసం అక్కడిప్రజలతోపాటు, టీడీపీశ్రేణు లు ఎదురుచూస్తున్నాయన్నారు. ఉద్యోగాలు తీసేస్తామ ని బెదిరిస్తే, ఆదాయానికి రుచిమరిగిన వాలంటీర్లు నేడు తలవొంచుకున్నా, భవిష్యత్ లోవారు అధికారపార్టీకి తగి న ప్రతిఫలం అందిస్తారన్నారు.

వాలంటీర్లు అధికారపార్టీ నేతల దౌర్జన్యాలకు, దాష్టీకాలకు భయపడి పనిచేస్తు న్నారని, వారు నేడు అనుభవిస్తున్న భయానికి తిరిగి వైసీపీనేతలకు తగినవిధంగా సమాధానంచెప్పి తీరుతా రని మర్రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల్లో దుర్వినియోగాని కి పాల్పడుతున్న వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదుచేస్తామన్నారు. వాస్తవాలు, ఆధారా లతో తగినవిధంగా సీఈసీ దృష్టికి తీసుకెళతామన్నారు. పెరగని ధరలు పెంచినట్లుగా టీడీపీ ప్రజలను మభ్య పెడుతోందని, అధికారపార్టీపై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీనేత లేళ్ల అప్పిరెడ్డి చెప్పడంహాస్యాస్పదంగా ఉంద న్నారు. ధరలు పెరిగాయో లేదో, అప్పిరెడ్డికి తెలియడం లేదా అన్నారు. బాధ్యతకలిగిన ప్రతిపక్షంగా తాము ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్పెలా అవుతుందో అప్పిరెడ్డి సమాధానంచెప్పాలన్నారు. టీడీపీప్రభుత్వం ధరలపెరుగుదలపై ముద్రించిన కరపత్రం ముమ్మాటికీ వాస్తవాలకు అక్షరరూపమని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశా రు. పెట్రోల్ –డీజిల్ ధరలు కేంద్రప్రభుత్వం పెంచితే రాష్ట్రానికి ఏమిసంబంధమని అప్పిరెడ్డి అంటున్నాడని, కేంద్రంతోపాటు ఏపీప్రభుత్వం అదనంగా వేసిన ట్యాక్సులపై ఆయనేం సమాధానంచెబుతాడన్నారు. టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడు కేంద్రం ధరలు పెంచినా, రాష్ట్రవాటాగా పెట్రోల్ – డీజిల్ పై లీటర్ కు, రూ.2వరకు నాటిప్రభుత్వమే భరించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం కేంద్రంతోపాటు, అదనంగా రాష్ట్రవాటాను పెంచిందని, దానితోపాటు రోడ్ సెస్ పేరుతో అదనంగా వసూలు చేస్తోందన్నారు.

కేంద్రం బాదుడుతో సంబంధం లేకుండా రాష్ట్రంఎంత దోచేస్తుందో తెలియాలంటే అప్పిరె డ్డి, పొరుగురాష్ట్రాల్లోని ధరలతో పోల్చిచూడాలన్నారు. ఒడిశాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.28గా ఉంటే, ఏపీలో రూ.98.52పైసలుగా ఉందన్నారు. తెలంగాణలో రూ.94.16పైసలని, కర్ణాటకలో రూ.93.59పైసలని, తమిళనాడులో రూ.92.58పైసలుగా ఉందన్నారు. ఈ విధంగా పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మాత్రమే పెట్రో ల్ డీజిల్ ధరలుఎక్కువగా ఎందుకున్నాయన్నారు. వాటితోపాటు ఎల్ పీజీ గ్యాస్ పైకూడా ధరలుపెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వంచేసే పప్పుబెల్లాల పంపిణీ పథకానికి తోడు, పథకాలద్వారా ప్రజలకు ఇచ్చింది తిరి గి సొంతఖజానాకే చేరేలా అధికారపార్టీపెద్దలు ఎన్నిగిమ్మిక్కులు అమలుచేస్తున్నారో అప్పిరెడ్డికి తెలియదా అని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. ప్రభుత్వఖజా నా నుంచి ప్రజలక రూపాయిచ్చి, తిరిగి సొంతఖజానా కువారినుంచి రూ.10లువచ్చేలాచేస్తున్నారన్నారు. పిచ్చిమద్యాన్ని రూ.250కుఅమ్ముతూ, ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పిచేస్తోంది నిజంకాదా అన్నారు. కేసుకి రూ.200లు డిస్టిలరీలు ముఖ్యమంత్రికి సమర్పిం చేలా ఒప్పందాలుచేసుకొని, సారా సిండికేట్ ల నుంచి ఏడాదికి రూ.4వేలకోట్లనుంచి రూ.5వేలకోట్ల వరకు దోపిడీ చేస్తున్నది నిజమోకాదో ప్రభుత్వపెద్దలుచెప్పాల న్నారు. లిక్కర్ మాఫియానుంచి జగన్మోహన్ రెడ్డి సొం తఖజానాకు తరలిపోతున్నాయని చెబితే, దాన్ని ఆప కుండా, తప్పునుఎత్తిచూపినవారిపై ఫిర్యాదు చేయడం ఏమిటో అప్పిరెడ్డి చెప్పాలన్నారు. ప్రజలను చైతన్యం చేయడంకోసం టీడీపీ మరింతగా ప్రచారంచేస్తుందని, కరపత్రాలతోపాటు, వివిధరకాలుగా వారికి ప్రభుత్వ దుర్మార్గాలను తెలియచేస్తూనే ఉంటుందన్నారు. వైసీపీ నేతలు వారికిష్టమొచ్చిన చోట ఫిర్యాదుచేసుకోవచ్చని మర్రెడ్డి తేల్చిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read