తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బోటు ప్రమాదం జరిగి సరిగ్గా నెల రోజులుకి, ఈ రోజు అదే తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మారేడుమల్లి-చింతూర్‌ ఘాట్‌ రోడ్డులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక పర్యాటక బస్సు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో మొత్తం 20 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది. 10 మంది అక్కడికక్కడే చనిపోగా, 5 గురుకి తీవ్ర గాయాలు అయ్యాయని, వీరి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. మిగతా వారికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

maredumalli 15102019 2

బస్సు మారేడమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది ? డ్రైవర్ నిర్లక్ష్యమా ? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు అటవీ ప్రాంతంలో జరగటంతో, ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పర్యాటక బస్సు కావటంతో, బస్సులో ఉన్న వారు, ఇక్కడి వారానే, మన రాష్ట్రం వారా, పక్క రాష్ట్రం వారా అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వారి కుటుంబాలకు సమాచారం పంపిస్తున్నారు.

maredumalli 15102019 3

నెల రోజుల క్రిందటే, తూర్పు గోదావరిలో ఘోర బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదపుగా 73 మంది ఉన్న బోటు, గోదావరి నదిలో మునిగిపోయింది. 25 మంది వరకు కాపాడగా, 50 మంది వరకు చనిపోయారు. ఇప్పటికీ 11 మంది మృతదేహాలు బయటకు తియ్యలేదు. ఈ ప్రమాదం పై, తరువాత జరిగిన బోటు వెలికితీత పనుల పై, ప్రభుత్వం పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వ యంత్రంగా మొత్తం ఉన్నా, నదిలో ఉన్న బోటు బయటకు తీసి, వారి కుటుంబాలకు మృతదేహాలు కూడా ఇవ్వలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి. మరో పక్క హర్ష కుమార్ లాంటి వాళ్ళు, కావాలనే బోటు బయటకు తియ్యటం లేదని, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయని, బోటు బయటకు తియ్యకుండా నాటకాలు ఆడుతున్నారని, సుప్రీం కోర్ట్ లో కూడా కేసు వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read