తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 82, ప్రజాకూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సహా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు తెరాస అభ్యర్థులపై వెనుకంజలో కొనసాగుతున్నారు. కూకట్‌పల్లిలో తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు.

count 10122018 2

నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య, కొడంగల్‌లో రేవంత్‌పై పట్నం నరేందర్‌ రెడ్డి, అందోల్‌లో దామోదర రాజనర్సింహపై చంటి క్రాంతికిరణ్‌, మధిరలో భట్టి విక్రమార్కపై లింగాల కమల్‌రాజ్‌ ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. చంద్రాయణ్ గుట్ట మాజీ ఎమ్మెల్యే, ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) శాసనపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం సాధించారు. మరోవైపు పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read