హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండే అఘోరాలు ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం అయ్యారు. సహజంగా వీళ్ళు జనావాసాల మధ్యకు రారు. అయితే వీరు ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండటం, అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ అఘోరాలు వచ్చింది టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి. ఈ అఘోరాలతో కలిసి సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి సేవలో మాత్రమే ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్, ఇలా అఘోరాలకు మొక్కటం పై, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న స్వరూపానందని కలిసిన సమయంలో, శ్రీవారి ప్రసాదం ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఫోటోలు వైరల్ అవ్వటంతో, అప్పుడు కూడా భక్తులు ఆగ్రహించిన విషయం తెలిసిందే.

aghora 14092019 2

ఈ విధంగా, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, అఘోరాలకు మొక్కిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వటంతో, ఈ విషయం చర్చనీయంసం అయ్యింది. అలాగే సుబ్బారెడ్డి తో పాటుగా బీజేపీ మాజీ ఎంపి గోకరాజు గంగరాజు నివాసంలోనూ అఘోరాలు ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అఘోరాలను తమ నివాసానికి తీసుకొచ్చి, గంగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే ఈ ఫోటోల పై ఇప్పటి వరకు ఇరువురు స్పందించలేదు. ఈ అఘోరాలు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమైనా పూజలు చేసారా, అనేది తెలియాల్సి ఉంది. అయితే, వారిని హిమాలయాల నుండి ప్రత్యేక ఖర్చులతో తమ నివాసాలకు తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది.

aghora 14092019 3

ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు వీరి ఇళ్ళకు విచ్చేయడం సంచలనంగా మారింది. సుబ్బారెడ్డి, గంగరాజు ఇద్దరూ తమ నివాసాలకు ఈ అఘోరాలను ఆహ్వనించటం, పూజలు నిర్వహించటం పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. దీని పైన సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారింది. అయితే గంగరాజు విషయం పక్కన పెడితే, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, సుబ్బారెడ్డి ఇలా చెయ్యటం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంది. దీని పై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు నడుస్తున్నాయి. అసలు అఘోరాలు ఎలాంటి పూజలు చేస్తారో తెలుసా ? దేని కోసమో ఈ పూజలు ? అఘోరాలతో టిటిడి చైర్మెన్ కు ఏమి పని ? ఇలా అనేక రకాల ప్రశ్నలు వేస్తూ, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read