ఒక పక్క చంద్రబాబు అన్నీ దుబారా ఖర్చులు పెట్టారు, చివరకు తాగే నీళ్ళు కూడా దుబారా, నీను కిన్లీ వాటర్ మాత్రమే తాగుతూ, పొడుపు చేసి, రాష్ట్ర సంపద పెంచుతున్నా అని చెప్తున్న జగన్ గారి మాటలకు, ఆయనతో పాటు, ఆయన మనుషులు చేసే పనులకు చాలా తేడా కనిపిస్తుంది. ఇప్పటికే జగన మోహన్ రెడ్డి తన ఇంటి కోసం ఇస్తున్న జీఓల పై టిడిపి అభ్యంతరం చెప్తుంది. జగన్ ఇంటి దగ్గర 1.5 కిమీ రోడ్డ కోసం 5 కోట్లు, టాయిలెట్ లు కట్టటానికి 30 లక్షలు, బ్యారికేడ్ లు కట్టటానికి 75 లక్షలు, కరెంటు పని చెయ్యటానికి 8.5 లక్షలు, ఇలా అనేక దుబారా ఖర్చులను తెలుగుదేశం ఎత్తి చూపిస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్తా సంచలనంగా మారింది. జగన్ బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మెన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. దీని పై జగన్ ఎలా స్పందిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

సహజంగా టిటిడి చైర్మెన్ కు తిరుమలలో క్యాంప్ కార్యాలయం ఉంటూ వస్తుంది. ఇంతకు ముందు వరకు చైర్మెన్ లు గా చేసిన వారు అందరూ ఇదే సాంప్రదాయం పాటిస్తూ, తిరుమలలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, కొత్త సంప్రదాయం సృష్టించారు. ఆయన తనకు తాడేపల్లిలో ఒక క్యాంపు కార్యాలయం కావాలని, టిటిడి పాలకమండలికి ఉత్తరం రాయటంతో, వారు ఆ పనిలో ఉన్నారు. తిరుమలలో ఉండాల్సిన చైర్మెన్, తాడేపల్లిలో ఏమి చేస్తారో మరి. అంతే కాదు, దీని కోసం, ఆయన నాకు ఆరుగురు సిబ్బంది కూడా కావాలని కోరారు. ఓ సూపరింటెండెంట్‌, ఇద్దరు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన జూనియర్‌ అసిస్టెంట్లు, ఓ అసిస్టెంట్‌ లేదా షరాబు, ఇద్దరు అటెండర్లను తన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కావాలని కోరారు. ఏకంగా చైర్మెన్ కోరితే, ఇక బోర్డు ఏమి చేస్తుంది. సరే అంది. అయితే ఎవరికీ అర్ధం కాని ప్రశ్న, తిరుమలలో సేవలు చెయ్యాల్సిన చైర్మెన్, తాడేపల్లిలో ఏమి చేస్తారా అని, ఈ నిర్ణయంతో టిటిడి అధికారులు అవాక్కయ్యారు. పొదుపు మంత్రం జపించే జగన్ గారు, ఇప్పుడు ఏమి చేస్తారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read