తిరుమల తిరుపతి దేవస్థానం తరుచూ వివాదాల్లోకి వెళ్తుంది. రెండు నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మకానికి పెట్టటం పెను వివాదం అయ్యింది. భక్తులు ఇచ్చిన ఆస్తులు కొన్ని అమ్మకానికి పెట్టారని వార్తలు రావటంతో, పెద్ద ఎత్తున వివాదం జరిగింది. అయితే వివాదం దేశ స్థాయిలో జరగటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కు తగ్గింది. అయితే ఇప్పుడైనా ఇలాంటి వివాదాలు జోలికి పోకుండా ఉంటారు అనుకుంటే, ఈ రోజు మరో వార్త ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంది. ఇది దేశ స్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. శ్రీవారికి ఉన్న డబ్బులు, బ్యాంకులలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటంతో, మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం పై విమర్శలు వచ్చాయి. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ విషయాన్ని ఖండించారు. ప్రభుత్వం ఈ చర్య వెనక్కు తీసుకోక పొతే పెద్ద ఉద్యమం చేస్తామని తిరుపతిలో కూడా నిరసన చేయటం జరిగింది. ఈ విషయం పై ఉదయం నుంచి అలజడి రేగింది. హిందూ మతానికి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా తిరుమల ఉన్న నేపధ్యంలో, ఇక్కడ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా, భక్తులు స్పందిస్తూ ఉంటారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు అన్నీ వివాదస్పదం అవుతున్నాయి.

ఈ రోజు భక్తులు కానుకులుగా ఇచ్చే డబ్బులు, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి, అక్కడ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేసే నిర్ణయం తీసుకోవటం, బ్యాంకులు కంటే, ప్రభుత్వం ఎక్కువ వడ్డీ ఇస్తుంది అంటూ సమర్ధించుకోవటం పై, ఉదయం నుంచి విమర్శలు వచ్చయి. దీని పై కోర్టులో కేసు వేయటంతో పాటుగా,అ ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధం అయ్యారు. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజా ఆగ్రహం గుర్తించిన ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం చేత పత్రికా ప్రకటన విడుదల చేపించింది. తాము ఈ నిర్ణయం అమలు పరచటం లేదని, ఎప్పటిలాగే ఇక నుంచి కూడా డిపాజిట్లు అన్నీ బ్యాంకుల్లోనే చేస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. బండ్ల రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో రేపు చేపట్టే నిరసన కార్యక్రమాలు వాయిదా పడే అవకాసం ఉంది. మొత్తానికి భక్తుల ఆగ్రహంతో మరోసారి టిటిడి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read