మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు, జాతీయ స్థాయిలో పోయింది. గతంలో ఇండియన్ మెడికల్ డివైజస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అని చెప్పి, రెడ్ నోటీస్ జారీ చేసింది. ఏపి ప్రభుత్వం నుంచి అనేక కోట్ల బకాయలు ఉండటంతో, వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తాజాగా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అని చెప్పి, హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లైర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటూ లేఖ రాసింది. ఆ అసోసియేషన్ లో ఉండే సభ్యులు అందరికీ కూడా లేఖ రాయటమే కాకుండా, ఎవరు అయినా సరే అసోసియేషన్ చేసిన సూచనలను ఉల్లంఘించి ఏపి ప్రభుత్వానికి వైద్య పరికరాలు సరఫరా చేస్తే అది మీ ఓన్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని కూడా, స్పష్టం చేసింది. ఒక వేళ అలా సప్లై చేయాలి అనుకుంటే, ముందుగానే డబ్బులు తీసుకుని ఆ తరువాత సరఫరా చేయాలని కూడా ఆదేశించింది. ఇక దీంతో పాటు, దాదాపుగా రూ.200 కోట్ల రూపాయలు సప్లైర్స్ కి ఇవ్వాలని చెప్పి, ఎప్పటి నుంచో అడుగుతున్నా, కనీసం ఏపి అధికారుల నుంచి స్పందన లేకుండా పోయిందని, ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు.

jagan 27112021 2

దీంతో పాటుగా, ఈ డబ్బు గురించి అడిగేందుకు వెళ్తే, కనీసం డైరెక్టర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని అందులో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ కు ఎటువంటి, వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అని చెప్పి, ఆ లేఖలో పేర్కొనటమే కాకుండా, గతంలో ఇండియన్ మెడికల్ డివైజెస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి, వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అని, దేశ వ్యాప్తంగా ఉండే తమ సభ్యులు అందరికీ కూడా విజ్ఞప్తి చేయటమే కాకుండా, వెబ్సైటు లో రెడ్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని కూడా ఈ లేఖలో ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లైర్స్ అసోసియేషన్ గుర్తు చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారులను సంప్రదిస్తే మాత్రం, తాము బిల్స్ ని ప్రాసెస్ చేస్తున్నాం అని మాత్రమే సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సర్వ సాధారణంగా, ఈ అసోసియేషన్ లో ఉండే సభ్యులు, తమ అసోసియేషన్ ఒక విషయం చెప్తే అది పాటిస్తారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read