ఇప్పుడు ఏ టివిలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా గుడివాడలో జరిగిన కాసినోనే హాట్ టాపిక్. గుడివాడ లో మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలోనే ఈ కాసినో జరిగిందని ఆధారాలు వీడియోలతో సహా టిడిపి చూపిస్తున్నా, కొడాలి నాని మాత్రం అక్కడ ఎటువంటి కాసినోలు జరగలేదని అడ్డంగా వాదిస్తుండంతో, జనం అంతా ఆశ్చర్య పోతున్నారు. స్పష్టంగా వీడియోలు బయటకు వ్బచ్చినా కూడా ఈయన ఏమి జరగలేదని ఎలా వాదిస్తాడని, అంతే కాకుండా ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి బూతు భాష ఏంటని కూడా జనం సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. నాని దీని పై మాట్లాడుతూ తన కే కన్వెషన్ ఎలాంటి కాసినోలు జరగలేదని, కేవలం ఎడ్ల పందేలు మాత్రమే జరగాయని అడ్డగోలుగా వాదించారు. అయితే తాజాగా ఏసెస్‌ క్యాసినో సంస్థ ఈ గుడివాడలో జరిగిన కాసినో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ దుమారం మరింత రేగింది. ఈ ఏసెస్‌ సంస్థ కాసినో నిర్వహించటంలో పేరుపొందిన సంస్థ. అయితే దీని నిర్వాహకుడు ప్రేమ్ వాలా ముంబయికి చెందిన వ్యక్తి . ఈ ప్రేమ్ వాలా కు చీకోటి ప్రవీన్ కు చాలా స్నేహ సంబందాలు ఉన్నాయి. అయితే ఈ చీకోటి ప్రవీణ్ గుడివాడ లో జరిగిన కాసినోలో మాట్లాడిన వీడియోలు ఈ ఏసెస్‌ సంస్థ తన ఫేస్ బుక్ పేజ్ లో ఉంచింది.

casino 24012022 2

ఈ వీడియోలన్ని సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ క్యాసినో సంస్థ అలాగే, ప్రేమ్ వాలా అనే వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టిన వీడియోల లింకులు కూడా టిడిపి బయట పెట్టింది. అయితే అది కాస్త వైరల్ అవ్వటంతో, ఆ తరువాత ఫేస్ బుక్ లో ఆ ఫొటోలన్ని డిలీట్ చేపించారు. కాని అప్పటికే అవన్ని వైరల్ అవ్వటం తో బండారం మొత్తం బయటపడిందని, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బయటకు వచ్చిన ఆ వీడియోల్లో అశ్లీల డాన్సులు వేయడం, వైసిపి నేతలు వాళ్ల మీద డబ్బులు విసురుతూ డాన్స్ వేయడం లాంటివి చూసి జనం అవాక్కవుతున్నారు. అయితే అక్కడ డిలీట్ చేసేసారు కాబట్టి, ఇక ఏ ప్రూఫ్ ఉండదు అని అనుకున్నారు. అయితే మళ్ళీ టిడిపి రంగంలోకి దిగింది. ఇదే ఏసెస్‌ క్యాసినో సంస్థ instagramలో పెట్టిన వీడియోలను, వాటి లింకులను టిడిపి ఈ రోజు మళ్ళీ బయట పెట్టింది. ఫేసు బుక్ లో డిలీట్ చేసారు కానీ, instagramలో మర్చిపోయారు అంటూ పంచ్ ఇచ్చింది. మొత్తానికి ఇన్ని ట్విస్ట్ లు మధ్య నిజాలు బయట పడుతున్నా, కొడాలి నాని మాత్రం, అడ్డ దిడ్డంగా వాదిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read