పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం , ఈ రెండు బిల్లులను కూడా రద్దు చేస్తూ, శాసనసభలో పెట్టిన ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నవి ఉన్నట్టు, అఫిడవిట్ రూపంలో, హైకోర్టుకు సమర్పించింది, రాష్ట్ర ప్రభుత్వం. నిన్న అఫిడవిట్ కు సంబంధించిన మెమో మత్రమే దాఖలు చేసినప్పటికీ, ఈ రోజు బిల్లులు కూడా అప్లోడ్ చేసారు. ఏదైతే శాసనసభ, శాసనమండలిలో, ఈ రెండు బిల్లులను ఆమోదించారో, ఆ బిల్లులకు సంబంధించిన కాపీలను కోర్టుకు ఇచ్చింది. శాసనసభలో, జగన్ మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, వీరిద్దరూ బిల్లులు ఉపసంహరిస్తూ పెట్టారో, దాంట్లో చివరలో నాలుగు లైన్లు క్లియర్ గా పెర్కొన్నారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్దికి సంబంధించి, వివధ ప్రజల ఆకాంక్షల మేరకు, బహుళ రాజధానులు తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అయితే కొన్ని లోపాలు ఉండటంతో, వాటిని సవరించి, సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుతూ, మళ్ళీ బిల్లు ప్రవేశపెడతాము, వెనక్కు తీసుకోవటం అనేది కేవలం తాత్కాలికమే అని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైతే అక్కడ పేర్కొన్నారో, దాన్నీ చట్ట రూపంలో తీసుకుని వచ్చి, బిల్లులు రూపంలో అది హైకోర్టుకు సమర్పించారు. సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

hc 27112021 2

దీని పై రాజధానికి సంబంధించిన, రైతులు, ఇప్పటికే కేసులు వేసి ఉన్నారో, ఆ రైతులు తరుపున న్యాయవాదులు అందరూ కూడా, ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ పై అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఇంటర్వెల్ మాత్రమే ఇచ్చిందని, ఈ బిల్లులు ఉపసంహరణ తాత్కాలికం అంటున్నారు కాబట్టి, మళ్ళీ బిల్లు ప్రవేశపెడతాం అంటున్నారు కాబట్టి, తమ వ్యాజ్యాలను లైవ్ లో ఉంచాలని హైకోర్టుని కోరేందుకు అధ్యయనం చేస్తున్నారు. దీని పై వాదనలు కొనసాగించటానికి సిద్ధం అవుతున్నారు. పైగా ఈ బిల్లులో శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించటం పట్ల, న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం అనేది కొంత మంది వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం అని, చట్టబద్ధత లేని దానికి, బిల్లులో పెట్టి, దానికి అనుగుణంగా మూడు రాజధానులు తెస్తాం అనేది, రాజ్యాంగంలోని ప్రాధమిక సూత్రాలకు ఇది విరుద్ధం అని, ఈ నేపధ్యంలోనే సోమవారం విచారణలో, ఈ విషయాలు అన్నీ లేవనెత్తి, తమ కేసులు అన్నీ లైవ్ లో ఉంచాలని కోరనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read