ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు షాక్ ఇచ్చింది. ఇద్దరు సీనియర్ అధికారులకు శిఖ విధిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ ఆదేశాలు అమలు చేయనందుకు, కోర్టు ధిక్కరణ కింద, చర్యలు తీసుకోవటమే కాదు, అరెస్ట్ చేయాలని, శిక్ష కూడా విదిస్తాం అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారి పూనం మాల కొండయ్య, అదే విధంగా మరో ఐఎస్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎంత కాలం శిక్ష అనేది ఈ నెల 29వ తేదీన ఖరారు చేస్తామని హైకోర్టు చెప్పింది. ఈ కేసు వివరాలు చూస్తే, గత ఏడాది ఫిబ్రవరి 28న, సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయం పై, కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్ళారు. ఈ నేపధ్యంలోనే, గత ఏడాది ఫిబ్రవరి 28న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు అధికారులకు కోర్టు దిక్కరాణ కింద కోర్టు శిక్ష విధించింది. అయితే ఈ రోజు కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా, కోర్టు ఆదేశాలు పాటించనందుకు, ఐఏఎస్ అధికారి పూనం మాల కొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

poonam 150925021 2

ఈ నెల 29న , ఇద్దరికీ శిక్షలు ఖరారు చేస్తామని కోర్టు చెప్పింది. అయితే ఇద్దరికీ ఎంత కాలం శిక్ష విధిస్తారు అనేది అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరు అధికారులు హైకోర్టులో అపీల్ చేస్తారా అనేది కూడా చూడాలి. గతంలో కూడా ఇలాగే కొంత మంది అధికారులకు శిక్ష పడగా, ఇన్నాళ్ళు తాము చేసిన సర్వీస్ చూసి, క్షమించాలి అని కోరటంతో, గతంలో హైకోర్టు మెత్తబడింది. మరి ఈ కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి. హైకోర్ట్ ఒప్పుకోక పొతే, సుప్రీం కోర్టుకు అపీల్ కు వెళ్ళే అవకాసం ఉంది. అయితే ఇంత పెద్ద సీనియర్ అధికారులు కూడా ఎందుకు ఇలా ప్రతి రోజు ఏదో ఒక కేసులో హైకోర్టు దగ్గర కోర్టు దిక్కరణకు పాల్పడి ఇబ్బందుల పాలు అవుతున్నారో అర్ధం కావటం లేదు. ఈ రోజు నరేగా బిల్లులు విషయంలో చీఫ్ సెక్రటరీని కూడా కోర్టు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. మొత్తంగా అనేక ఇబ్బందులు పాలు అవుతున్నారు ఐఏఎస్ అధికారులు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు కానీ, అధికారులు బలి అయిపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read