వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎదురు చెప్తే, తన మన తేడా ఉండదు. చివరకు సొంత కుటుంబాన్ని కూడా జగన్ కోసం విమర్శిస్తూ ఉంటారు. వీరికి ముఖ్యంగా ఉండే అస్త్రాలు బులుగు మీడియా, పేటీయం సోషల్ మీడియా, వీరికి తోడు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, వాలంటీర్ వ్యవస్థ. వీళ్ళని ఉపయోగించి, ఎవరు అయితే వీరిని ప్రశ్నిస్తారో వారిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు సొంత మనుషులు అయినా, తమకు ఓటు వేసిన వారు అయినా, ఎవరైనా సరే. మొన్న జరిగిన సుబ్బారావు గుప్తా సంగతి కానీ, అలాగే సినిమా వాళ్ళని టార్గెట్ చేయటం కానీ, ఇలా ఏదైనా, ఎవరైనా సరే. ఇప్పుడు తాజాగా, రెండు చేతులతో, రెండు కాళ్ళతో ఓటు వేసిన, ఉద్యోగులు ఇప్పుడు వీరి టార్గెట్. గతంలోనే కాదు, అసలు ఏ రాష్ట్రంలో, ఎప్పుడు లేని విధంగా, ఏకంగా ఉద్యోగుల జీతాలు తగ్గించారు. ఐఆర్ 27 శాతం ఇచ్చి, పీఆర్సి 23 శాతం ఇస్తే, 4 శాతం తగ్గినట్టే కదా ? అదేమీ అంటే, పెండింగ్ డీఏలు కూడా ఇస్తున్నాం అంటున్నారు. పెండింగ్ డీఏలను, పీఆర్సీతో ఎలా కలుపుతారు అని అడిగితే మాత్రం, సారైన సమాధానం లేదు. ఇలా ఉద్యోగులు అడిగే అనేక ప్రశ్నలకు, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకే, రాజకీయ వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేసింది. ప్రత్యర్ధి పార్టీల పై ఎలా ఎదురు దా-డి చేస్తారో, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు.

prc 24012022 2

ఇందు కోసం, తమ బులుగు మీడియాని, అలాగే పేటీయం బ్యాచ్ ని, వాలంటీర్లను రంగంలోకి దించారు. టీచర్లు, ఉద్యోగులు పై విష ప్రచారం మొదలు పెట్టారు. బులుగు మీడియాలో, ఉద్యోగుల జీతాలు తగ్గలేదు, పెరిగింది అని ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఫేక్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు అని, అలాగే టీచర్లు పాఠాలు చెప్పకుండా నిద్ర పోతున్నారని, ఇలా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫోటోలు తీసుకుని వచ్చి, ప్రచారం చేస్తున్నారు. ఇక వాలంటీర్లకు కొన్ని కర పత్రాలు ఇచ్చి, ఇంటి ఇంటికీ వెళ్లి వాటిని పంచమని ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు ఎంతో చేస్తున్నామని, వారు అడిగిన జీతాలు ఇవ్వాలి అంటే, పధకాలు ఆపివేయాలి అనే ప్రచారం మొదలు పెట్టారు. మొత్తంగా జగన్ మొహన్ రెడ్డి ఎంతో గొప్ప వారు, ఉద్యోగులే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు. సహజంగా ఉద్యోగుల పైన, సమాజంలో ఉన్న కోపాన్ని వాడుకుని, ఉద్యోగులను దోషులుగా చూపించి, వారికి మద్దతు లేకుండా చేయాలని, ప్రభుత్వం ప్లాన్ వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read