మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు మీడియా సమావేశం పెట్టి జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పాలన డిజాస్టరెస్ అని, జగన్ పుర్తిగా పరిపాలనలో ఫెయిల్ అయ్యారని ఉండవల్లి అన్నారు. అప్పులు విపరీతంగా చేస్తున్నారని, 63 ఏళ్ళలో ఏపి చేసిన అప్పుని, జగన్ మోహన్ రెడ్డి కేవలం రెండేళ్ళలో చేసారని అన్నారు. రకరకాల మార్గాల్లో అప్పుల కోసం వెంపార్లాడుతున్నారని ఉండవల్లి అన్నారు. అప్పులు సంగతి పక్కన పెడితే, జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి అనేది విచ్చలవిడి అయిపోయిందని ఉండవల్లి అన్నారు. ఎక్కడ చూసినా ఏమి చూసినా అంతా అవినీతిమయం చేసి పడేసారని ఉండవల్లి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సియంగా ఉంటాను అంటే, ఎంత అద్భుతంగా పాలిస్తాడో అనుకున్నా అని, కానీ ఇక్కడ మాత్రం చాలా ఘోరంగా ఉందని ఉండవల్లి అన్నారు. వింత వింత బిల్లులు తెస్తున్నారని ఉండవల్లి అన్నారు. బీపీ పెరిగింది కాబట్టి వెళ్లి కొట్టి వచ్చారని, ఒక ముఖ్యమంత్రి అనటం చూసి ఆశ్చర్యం కలిగిందని, ఎవరో ఏదో ఒక మాట అంటే, దానికి అర్ధాలు చెప్పే వరకు సియం వ్యవహరం వెళ్లిందని, ఈ ధోరణి ఏమిటో అర్ధం కావటం లేదని ఉండవల్లి అన్నారు. ఇలాంటివి సమర్ధించే వ్యక్తి సియంగా ఎందుకు అని అన్నారు ?

undvaalli 27112021 2

ఇక నారా భువనేశ్వరి పై జరుగుతున్న చర్చ పై స్పందిస్తూ, ఎన్టీఆర్ కూతురు పైన అలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అంటూ ఉండవల్లి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పిల్లల పై ఎప్పుడూ ఎలాంటి పుకార్లు రాలేదని అన్నారు. చంద్రబాబు కూడా వాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకుని వదిలేసి ఉండాల్సింది అంటూ ఉండవల్లి చెప్పారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామాలు అంటున్నారని, అలా అని నేను అనుకోవటం లేదని ఉండవల్లి అన్నారు. సింపతీ అనేది పని చేయదని అందరి కంటే చంద్రబాబుకే తెలిసు అని, మొన్న ఆయన బాధ పడటం నిజమే అని అన్నారు. ఇక కొడాలి నాని పై ధ్వజమెత్తారు. ఒక మంత్రి చంద్రబాబు స్థాయి నేతను పట్టుకుని, అరేయ్ ఒరేయ్, వెధవ అని తప్ప దిగటం లేదని, ఎంత దారుణం అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఇలాంటివి ఖండించకుండా ఏమి చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారని, ఇవి సరిదిద్దుకోక పోతే, చరిత్రలో బ్లాక్ మార్క్ గా జగన్ ఉండి పోతారని ఉండవల్లి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read