ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో, పెద్ద వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు సియంగా ఉండగా, పోలవరం అంచనాలు 55 వేల కోట్లకు కేంద్రం జల శక్తి శాఖ టెక్నికల్ కమిటీ ఆమోదం చేసిన విషయం పక్కన పెట్టి, ఇప్పుడు మేము అంత డబ్బులు ఇవ్వం అంటూ, కేవలం 20 వేల కోట్లకే పోలవరం అంచనాలు తగ్గిస్తున్నట్టు కేంద్రం చెప్తుంది. అయితే ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై పోరాడకుండా, చంద్రబాబు పై తప్పు నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం పై, జగన్ పై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చెప్తున్న ప్రతి దానికి తలొగ్గి, జగన్ మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు అంటూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండవల్లి మాట్లాడతారనే పేరు ఉంది. ఆయనే అనేక సార్లు చెప్పారు కూడా. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా సాఫ్ట్ కార్నర్ ఉందని ఉండవల్లి అన్నారు. అయితే పోలవరం విషయంలో మాత్రం, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో, రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినా జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి లొంగిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో పాదయాత్రలో అంచనాలు ఎందుకు పెంచారు అంటూ చంద్రబాబు పై అంత ఎత్తున ఎగిరి, ఇప్పుడు బోర్లా పడ్డారని, అలాగే ప్రతి మీటింగ్ లో, పోలవరం కేంద్రం కట్టాలి, నువ్వు ఎందుకు తీసుకున్నావ్ అంటూ చంద్రబాబుని ప్రశ్నించిన జగన్ ను చూసి, ఈయన అధికారంలోకి రాగానే, పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తారని అనుకున్నాని అన్నారు.

జరుగుతున్నవి చూస్తుంటే, జగన మోహన్ రెడ్డి, తన కేసుల విషయం పై భయపడుతున్నారని, అందరూ అనుకుంటున్నారని, చూస్తుంటే అలాగే ఉందని అన్నారు. కేసీఆర్ పెద్ద మొనగాడు అని కేంద్రంతో పోరాడుతున్నారా ? నీకెందుకు భయం ? కేసులు ఇప్పుడే ఏమి తేలవు కదా అయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే ఎలా ? అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. మోటార్లు పెడతాం అంటే సరే అంటారు, కేంద్రం ఏది చెప్తే అది ఒప్పుకుంటుంటే, పోలవరం కోసం ఇవన్నీ భరిస్తున్నారు అనుకుంటే, నేడు పోలవరం కూడా కేంద్రం చెప్పినట్టు వింటేఇంకా ఎందుకు ఈ పదవులు అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రతి దానికి చంద్రబాబు పై తోయటానికి మీకు అధికారం ఇవ్వలేదని అన్నారు. పోలవరం బాధ్యతల నుంచి జగన్ ప్రభుత్వం తప్పుకుందనే తాను భావిస్తున్నానని, కేంద్రాన్ని డిమాండ్ చేయాలని నిస్సహయ స్థితిలో జగన్ ఉన్నారని అన్నారు. కేవలం ఒక కేసు వేస్తె చాలని, మోడీ కాలర్ పట్టుకుని, పోరాడాల్సిన అవసరం లేదని, పోలవరం విభజన చట్టంలో పెట్టిన మన హక్కు అని, ఉండవల్లి అన్నారు. కేవలం కోర్టులో కేసు వేసినా చాలని, జగన్ ప్రభుత్వం అది కూడా చేయలేకపోతుందని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read