వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, చాలా రోజుల గ్యాప్ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జూలై 2006లో, రాజశేఖర్ రెడ్డి రాసిన లేఖను ఉండవల్లి బయట పెట్టారు. అందులో, రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యాలి అంటూ, రాజశేఖర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఉంది. ఇప్పుడు ఇదే విషయం పై, ఉండవల్లి జగన్ మోహన్ రెడ్డిని కోరారు. హైకోర్ట్ బెంచ్ ని, రాజమండ్రిలో ఏర్పాటు చెయ్యాలని, ఉండవల్లి జగన్ ను కోరారు. ఇదే సందర్భంలో, 14 ఏళ్ళ క్రితం, రాజశేఖర్ రెడ్డి, రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసే ఆలోచన చేసారని గుర్తు చేస్తూ, ఆ నాటి లేఖలు బయట పెట్టారు ఉండవల్లి. ఇదే విషయాన్నీ జగన్ కు లేఖ రూపంలో తెలియ చేస్తూ, ఆ నాడు రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని వివరించారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ బెంచ్ ని రాజమండ్రిలో ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని కోరారు.

undavalli 19022020 2

ఇప్పటికే ఈ రాజధానులు, హైకోర్ట్, అసెంబ్లీ విషయం పై, రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉన్న రాజధానిని మూడు ముక్కలు చెయ్యటం, అలాగే హైకోర్ట్ ని కర్నూల్ తరలించి, హైకోర్ట్ బెంచ్ ని అమరావతి, వైజాగ్ లో పెడతాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎలాగూ వైజాగ్ కి సచివాలయం తరలిస్తున్నారు కాబట్టి, హైకోర్ట్ బెంచ్ ని రాజమండ్రిలో పెట్టాలి అంటూ, ఉండవల్లి చెప్పటమే కాదు, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇలా చెయ్యాలి అనుకున్నారు అంటూ, ఒక లేఖ కూడా ఉండవల్లి బయట పెట్టరు. దీంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ లేఖతో ఉండవల్లి ఫిక్స్ చేసారనే చెప్పాలి. ఏ స్ట్రాటజీతో అయితే, జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేద్దామని అనుకున్నారో, ఇప్పుడు అదే స్ట్రాటజీతో ఉండవల్లి జగన్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మరో పక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై కూడా ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాబడి తీవ్రంగా పడిపోయింది అని, కేంద్రం పరిస్థితి కూడా అలాగే దినదిన గండంగా ఉందన్నారు. ఒక పక్కన కేంద్రం నుంచి రావాల్సినవి రకాపోగా, రాష్ట్రంలో కూడా ఆదాయం పడి పోయింది అని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భయానకంగా ఉందని ఉండవల్లి అన్నారు. ఈ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత, మొత్తం అర్ధం అవుతుందని అన్నారు. దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడని, జగన్ అంటూ ఉంటారని, ఇప్పుడు ఆ దేవుడే జగన్ ను ఆదుకోవాలని, పరిస్థితి అలా ఉందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ అంటూ ఉంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని కోరుకుంటున్నా అని ఉండవల్లి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read