కో-వి-డ్ వ్యాక్సినేషన్ విషయంలో సమర్థంగా పనిచేయకపోతే రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు గైడ్ లైన్స్ ఇచ్చారు. రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర గైడ్ లైన్స్ చూస్తే.. కొన్ని షరతులు పెట్టడం జరిగింది. జనాభా ఆధారంగా, కోవిడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా వేగంగా వ్యాక్సిన్ చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేస్టేజ్ తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనిని బట్టి ఏ రాష్ట్రాలు సమర్థంగా పనిచేస్తాయో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చాలా స్పష్టంగా కేంద్రం చెప్పింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోవాలి. జగన్ రెడ్డి కనుక వేస్టేజ్ లేకుండా వ్యాక్సినేషన్ చేపట్టకపోయినా, వేగంగా చేయకపోయినా, అధిక సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయినా ఆ ప్రభావం రాష్ట్రంపైనా, ప్రజలపైనా పడే ప్రమాదం ఉంది. జగన్ రెడ్డి ఇప్పటికే తన అసమర్థతతో వైఫల్యాలు మూటగట్టుకున్నారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరాలో విఫలమయ్యారు. వ్యాక్సినేషన్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. రెండు డోసులు కలిపి కోటి 9 లక్షల 90 వేలు మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్లు అందించాం. 25 శాతం కంటే తక్కువ. ఇంకా 75 శాతం మందికి ఒక డోస్ కూడా అందలేదు. గుజరాత్ లో కోటి 86 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో కోటి 65 లక్షలు, కర్ణాటకలో కోటి 54 లక్షలు, మహారాష్ట్రలో 2 కోట్ల 44 లక్షలు, యూపీలో 2 కోట్ల 8 లక్షలు, బీహార్ లో కోటి 11 లక్షలు వ్యాక్సిన్లు వేశాయి. భవిష్యత్ లో సమర్థంగా పనిచేసే రాష్ట్రాలకే ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ఆధారంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సినేషన్ విషయంలో.. ఇచ్చిన డోసులు పరిశీలిస్తే.. ఏపీ చాలా వెనుకబడి ఉంది.

ఏపీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కూడా సరిగా వ్యాక్సినేషన్ జరగలేదు. ఏపీకి 65.5 లక్షల డోసులు పంపిస్తే.. వినియోగించింది 26.10 లక్షలు మాత్రమే. జగన్ రెడ్డి, సజ్జల మాత్రం గొప్పలు చెప్పుకున్నారు. ప్రగల్బాలు పలికారు. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను ఎందుకు సమర్థంగా వినియోగించుకోలేక పోయారో సమాధానం లేదు. 39.8శాతం మాత్రమే వినియోగించుకున్నారు. రాజస్థాన్ 54.11, ఢిల్లీ 55.1, వెనుకబడిన చత్తీస్ ఘడ్ కూడా 45.53 శాతం, జార్ఘండ్ 52.11, కేరళ 54.14 శాతం కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్లను వినియోగించుకున్నాయి. ఏపీ పూర్ ఫెర్ఫార్మెన్స్ కు ఏం సమాధానం చెబుతారు? వ్యాక్సినేషన్ వేస్టేజ్ విషయంలో ఏపీలో 11.6 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో యావరేజ్ గా ఇది 6.5 శాతం మాత్రమే ఉంది. రాజస్థాన్ లో 5.6, అస్సాంలో 5.5, గుజరాత్ 5.3, వెస్ట్ బెంగాల్ లో 4.8శాతం, తమిళనాడులో 3.7శాతం, బీహార్ లో 4శాతంగా ఉంది. వేస్టే జ్ లో కూడా మనం చాలా ఎక్కువస్థాయిలో ఉన్నాం. నూతన గైడ్ లైన్స్ ప్రకారం ఏపీకి ఎక్కువగా వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. దీనిపై ఏం సమాధానం చెబుతారు? జగన్ రెడ్డి అసమర్థత వల్ల వ్యాక్సినేషన్ అందక ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది. కేంద్రం డిసెంబర్ నాటికి 44 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. రాష్ట్రం సమర్థంగా పనిచేస్తేనే వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా వస్తాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మెడికల్ కాలేజీల విషయంలో గ్రాఫిక్స్ కే జగన్ రెడ్డి పరిమితం అవుతున్నారు. బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవు. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలను మభ్యపెట్టడానికే డ్రామాలు ఆడుతున్నారు. కో-వి-డ్ రోగులకు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమయ్యారు. మరణాలు కూడా దాచిపెడుతున్నారు. బ్లా-క్ ఫం-గ-స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని విధాలుగా జగన్ రెడ్డి విఫలమయ్యారు. తన అసమర్థత వల్ల చాలా నష్టపోతున్నాం. ఇప్పటికైనా మేలుకుని తన పనితీరును మెరుగుపర్చుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ఆసుపత్రులను సందర్శించి భరోసా ఇవ్వాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో మనం నష్టపోయే ప్రమాదం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read