వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఒక రోజు ముందు నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూనే ఉంది. సహజంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో, బెనిఫిట్ షో లు వేయటం, వారం, రెండు వారాలు టికెట్ రేట్లు పెంచటం, ఇవన్నీ సహజంగా జరిగేవి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉంది. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కూడా, చాలా సినిమాలకు, ఇలాగే అవకాసం ఇచ్చారు. అయితే వకీల్ సాబ్ సినిమా విషయంలో మాత్రం, ముందు రోజు రాత్రి, టికెట్ రేట్లు పెంచటానికి వీలు లేదని, బెనిఫిట్ షోలకు అవకాసం లేదని ఆర్డర్స్ వచ్చాయి. దీంతో అప్పటికే టికెట్లు అమ్ముకున్న వారు షాక్ తిన్నారు. ఇక పవన్ ఫాన్స్ కూడా ఈ విషయంలో, ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజకీయంగా, ఇబ్బందులు గురి చేసేందుకే, ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే రిలీజ్ కు ముందు నుంచి టికెట్ ధరల విషయంలో, వివాదం నడుస్తూనే ఉంది. దీంతో సినిమా యూనిట్, రెండు వారల పాటు ధరలు పెంచే విషయంలో, అనుమతి ఇవ్వాలి అంటూ, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అన్నీ కోర్టుకు చూపించి, కోర్టుని ఆశ్రయించటం జరిగింది. దీంతో హైకోర్టు, రెండు వారాలు కాకుండా, మూడు రోజులు పాటు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

vakeel 10042021 2

అయితే ఈ ఆదేశాల పై ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేయనుంది. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేయనున్నారు. మూడు రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చు అంటూ, హైకోర్టు తీర్పుని సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో దీని పై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనుంది. అయితే ఈ చర్య నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసే చర్య అని చెప్పుకోవాలి. ఏ సినిమాకు లేని ఇబ్బంది, కేవలం ఈ సినిమాకే ఎందుకు కలిగిస్తున్నారు, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, అన్ని సినిమాలకు ఇదే నిబంధన వర్తింప చేయాలని, అంతే కానీ తమ అధికారాన్ని ఇలా రాజకీయ కక్ష కోసం వాడకూడదని వాపోతున్నారు. అయినా హైకోర్టు, కేవలం మూడు రోజులు వరుకే పర్మిషన్ ఇచ్చింది. దీనిని కూడా ప్రభుత్వం, అత్యవసర పిటీషన్ గా, హౌస్ మోషన్ పిటీషన్ రూపంలో వేయటం చూస్తుంటే, రాజకీయ కక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read