తూర్పు గోదావరి జిల్లాల్లో, అధికార వైసీపీ నేతల అరాచకానికి మచ్చుతునకగా ఉన్న, శిరోముండనం బాధితుడు వరప్రసాద్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. తన కేసును సీబీఐకి అప్పగించాలని బాధితుడు ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. శిరోముండనం బాధితుడు ప్రసాద్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు, సీబీఐ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేసింది. తన పై పదే పదే కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారంటూ పిటిషన్‍లో పేర్కొన్నారు శిరోముండనం బాధితుడు ప్రసాద్. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కోర్టుకు తెలిపారు. ఇసుక మాఫిను అడ్డుకున్నందుకు ప్రభుత్వం వేధిస్తోందని, హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ ప్రసాద్. అధికార పార్టీ నేతలు, పోలీసులు పై ఒత్తిడి తీసుకుని వచ్చి, ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసారని తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదని, బాధ్యులైన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కేవలం పోలీస్ శాఖకు చెందిన ఎస్ఐ పై మాత్రమే , చర్యలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

hc 020332021 2

అయితే సదరు ఎస్ఐ, ఎవరి ఆదేశాల మేరకు, శిరోముండనం చేసారో, ఆ వైసీపీ అధికార పార్టీ నేతల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి న్యాయం జరిగాలి అంటే, దీని వెనుక ఉన్న దోషులకు తగిన శిక్ష పడాలి అంటే, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని కోర్టుని కోరారు. ఈ నేపధ్యంలోనే, వరప్రసాద్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్, గత కొంత కాలంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు అనే విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. అయితే అందరి వాదనలు విన్న హైకోర్టు, సిబిఐని ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్తూ, తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే నేపధ్యంలో వరప్రసాద్ పై మరో కేసు నమోదు చేయటంతో, తన పై అనవసరంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. అయితే పిటీషనర్ వరప్రసాద్ స్వయంగా కోర్టుకు కూడా విన్నవించుకున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పి, శిరోముండనం చేయటానికి బాధ్యలును శిక్షించాలని హైకోర్టుని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read