గోదావరిలో జరిగిన పెను విషాదం పై, మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం చెప్తుంది. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నారని, ఆయన కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి అని ప్రభుత్వ వరాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎలాంటి బోటు అయినా, దేవీపట్నం దగ్గర పోలీసులు చెక్ చేస్తారు. ఇక్కడ కూడా అక్కడ పోలీసులు చెక్ చేసి పంపించారని వార్తల్లో చెప్తున్నారు. మరి ఎలాంటి అనుమతులు లేని బోటుకు, అక్కడ పోలీసులు ఎందుకు వదిలి పెట్టారు ? కేవలం సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు మాత్రమే చూస్తారా ? అనుమతులు ఉన్నాయా లేవా అనేది చూడరా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మరోసారి, ఇలాంటి ఘటనలలో, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయట పడింది.

boat 15092019 2

మరో పక్క ఉదయం 10:30 కు సంఘటన జరిగితే, ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు చేపట్టలేదని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళటానికి తీవ్రమైన ఇబ్బందులు ఉండటంతో, నేవీ సహాయం తీసుకోవాలని చూస్తున్నారు. హెలికాప్టర్ వచ్చినా, వాళ్ళు సహాయక చర్యలు చేసేది ఏమీ ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావటంతో, అక్కడకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ, స్థానికులు మాత్రమే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళటానికి, ఇంకా సమయం పట్టే అవకాసం ఉంది.

boat 15092019 3

మరో పక్క, దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. అలాగే బోటు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్ స్పందించారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతయ్యారనే విషయం బాధ కలిగించిందన్న పవన్.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో పక్క తాడేపల్లి నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా పరిస్థితిని ఎప్పటికపుడు అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read