దుర్గగుడిలో జరిగిన ఏసీబీసోదాల్లో అవినీతికిపాల్పడిన అసలు దొంగైన వెల్లంపల్లి శ్రీనివాస్ ను వదిలేసి, అమాయకులైన ఉద్యోగులను సస్పెండ్ చేయడం మంచిపద్ధతికాదని, దేవాదాయ శాఖకే మచ్చతెచ్చిన వెల్లంపల్లి, దేవాదాయశాఖలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూలేనట్టు, వెల్లంపల్లి దోపిడీకి పాల్పడ్డాడని టీడీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో టీడీపీ అధికారప్రతినిది నాగుల్ మీరాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏసీబీసోదాల్లో అసలు వాస్తవాలు బయటకురాలేదని, అందుకే వాటిని ప్రజలముందుంచడానికి తాము మీడియాముందుకు వచ్చినట్లు బుద్దా తెలిపారు. దుర్గగుడిలో మాయమైనచీరల్లో కొన్ని వెల్లంపల్లి ఇంటికి వెళితే, మరికొన్ని ఆయన దుకాణానికి వెళ్లాయన్నారు. ఆఖరికి అమ్మవారికి వేసే కానుకలు, చెల్లించే మొక్కుబడులు, హుండీలో వేసే ఇతరవిలువైన వస్తువులను సాధారణంగా భక్తులసమక్షంలో లెక్కించాలన్నారు. అలాకాకుండా డినామినేషన్ అనేది బహిరంగంగా అందరిముందుచేయరని, మంత్రివెల్లంపల్లి వచ్చాకే అది జరుగుతుందని, దానిలో కోటిరూపాయలు వస్తే, రూ50లక్షలు మాత్రమే అధికారికంగా చెప్పి, మిగిలిందంతా శ్రీనివాస్ కాజేస్తాడన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేస్థాయిలో తనదోపిడీని ప్రారంభించిన వెల్లంపల్లి, నేడు మంత్రి హోదాలో దాన్నిరెండింతలకు పెంచాడన్నారు. ఏసీసీఅధికారులు, ప్రభుత్వం కేవలం దుర్గగుడికే పరిమితం కాకుండా, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల దేవాలయాలలో కూడా తనిఖీలుజరపాలన్నారు. ద్వారకాతిరుమలలో వెల్లంపల్లి సాగిస్తున్న దోపిడీ అంతాఇంతా కాదన్న వెంకన్న ఆఖరికి విజయవాడలోని వినాయక దేవాలయాన్నికూడా మంత్రి వదల్లేదన్నారు.

విఘ్నేశ్వరుడి ఆలయంతోపాటు, విజయేశ్వరస్వామి ఆలయాన్నికూడా శ్రీనివాస్ తనదోపిడీకేంద్రాలుగా మార్చుకున్నాడన్నారు. రూ.కోటి30లక్షలతో నిర్మించిన దుకాణాల అద్దెలనుకూడా తనకు నచ్చిన ధరకే వెల్లంపల్లి నిర్ణయించాడన్నారు. వెల్లంపల్లి తనకూతురిపై ప్రమాణం చేసి, అమ్మవారిగుడిలో ప్రమాణంచేసి, తాను దేవుడి సొమ్మురూపాయికూడా తినలేదని చెప్పగలడా అని వెంకన్న నిలదీశారు. ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వెల్లంపల్లిని అరెస్ట్ చేస్తేనే అసలు వ్యవహారాలు బయటకు వస్తాయన్నారు. వెల్లంపల్లి కనుసన్నల్లోనే దుర్గగుడి నడుస్తోందని, అక్కడ జరిగే ప్రతిఅవినీతిలో ఆయనప్రమేయం ఉందన్నారు. నెలకు రెండుసార్లు తిరుమలవెళ్తూ, తనవెంట తీసుకెళ్లేవారికి స్వామివారి దర్శనంచేయించి,వారినుంచి కూడా డబ్బులు దండుకుంటున్నాడన్నారు. గతఎన్నికల్లో రూ.10కోట్ల ఆస్తిని ఎన్నికల అఫిడవిట్ లోచూపిన వెల్లంపల్లి ఆస్తినేడు కోట్లాదిరూపా యలు ఎలా అయిందో ఆయనే సమాధానంచెప్పాలన్నారు. 2009 – 2014 మధ్యలో వెల్లంపల్లి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, జగన్మో హన్ రెడ్డి సొంతపత్రిక అయినసాక్షిలో శ్రీనివాస్ పై చెన్నైలో వ్యభిచార కేసులు నమోదయ్యాయని రాశారు. ఆవ్యవహారంపై కూడా జగన్ ప్రభుత్వం విచారణ జరిపి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని బుద్దా డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read