మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదస్పదం అయ్యింది. ఆప్షన్ అనేది లేకుండా, ప్రతి ప్రభుత్వ స్కూల్ లో, ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవాలి అంటూ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు, తీవ్ర దుమారాన్ని రేపాయి. గతంలో చంద్రబాబు ఇచ్చినట్టుగా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్స్ ఇచ్చి, ఎవరికీ కావల్సింది వారిని ఎంపిక చేసుకునేలా చెయ్యాలని వాదనలు వినిపిస్తున్నాయి. మన మాతృభాషని పూర్తిగా తీసేయటం పై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం, మాకు సమాజనం నుంచి ఒత్తిడి ఉంది, అందుకే నిర్ణయం తీసుకున్నాం అని చెప్తుంది. అయితే, తెలుగు భాష ప్రేమికులు మాత్రం, ఇలా బలవతంగా రుద్దు కూడదు అని, ఎవరి అభిప్రాయాన్ని వారికి వదిలేయాలని అంటున్నారు. గతంలో ఆందోళన చేసిన లక్ష్మీప్రసాద్, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు మాత్రం, కనీసం కూడా ఈ విషయం పై స్పందించక పోగా, ఎదురు అద్భుతమైన నిర్ణయం అంటూ, భజన చేస్తున్నారు.

venkaiah 10112019 2

అయితే, వీరి సంగతి ఇలా ఉంచితే, ఈ రోజు ఈనాడు దినపత్రికలో, భారత ఉప రాష్ట్రపతి, వెంకయ్య నాయుడు రాసిన ఆర్టికల్ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అనే చెప్పాలి. డైరెక్ట్ గా తెలుగు భాష పై రాసి, వివాదాస్పదం చెయ్యకుండా, ఆయన భారత దేశంలో ఉన్న అన్ని భాషల గురించి ప్రస్తావిస్తూ, మాతృభాష గొప్పదనాన్ని వివరిస్తూ, నేటి కాలంలో ఎలా నిర్వీర్యం చేస్తున్నారో చెప్తూ, ఆర్టికల్ రాసారు. దీనిలో ప్రభుత్వాల బాధ్యత చెప్తూ, "బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లో విద్యను ఏ భాషలో నేర్పించాలన్న విషయమై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. " అంటూ రాసిన వ్యఖ్యం చూస్తుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న నిర్ణయానికి కూడా ఇది వర్తించేలా ఉంది.

venkaiah 10112019 3

మాతృభాషలో అయితేనే పిల్లలు, మేధాసంపన్నతను వెల్లడించడానికి, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి అవకాసం ఉంటుందని చెప్పారు. "పెద్దలనుంచి ఘనమైన వారసత్వంగా పొందిన భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల మన పిల్లల్లో ప్రేమను ఇనుమడింపజేయాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ఏ మాత్రం తొట్రుపడినా భారతీయ విలక్షణ సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. భావ వ్యక్తీకరణకు అమ్మభాషే ఆత్మ! మాతృభాషను గుర్తించి, గౌరవించి, కాపాడుకునేందుకు యావద్దేశమూ కంకణబద్ధం కావాల్సిన తరుణమిది!" అంటూ వెంకయ్య నాయుడు తన వ్యాసాన్ని ముగించారు. ఆయన రాసింది, జనరల్ గా అయినా, మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రాష్ట్రంలో జరుగుతున్న చర్చకు మాత్రం, ఈ ఆర్టికల్ దోహదపడుతుంది. ఇందులోని మంచిని, మన ప్రభుత్వం కూడా తీసుకుంటే, అటు ఉపరాష్ట్రపతి చెప్పింది గౌరవించినట్టు ఉంటుంది, ఇటు ఈ వివాదానికి కూడా తెర దించినట్టు అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read