42 ఏళ్ల తర్వాత తొలిసారిగా తాను లేకుండా ఎన్నికలు జరిగాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన సొమ్ముతోనే ఎన్నికలలో పోటీ చేసేవాళ్ళమని, నిత్యం ప్రజల మద్య తిరుగుతూ వాళ్లు చెప్పేది వినకపోతే తనకు మనశ్శాంతి ఉండదని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు దూరం అయ్యానని, అయినా గౌరవపదమైన పదవిలో ఉన్నానని అన్నారు. ఆదివారం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన గుంటూరు క్లబ్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియాలో తాను ఎక్కడ డాక్టరేట్‌లు తీసుకోలేదని, ఇక్కడ డాక్టరేట్‌లపై పెద్దగా గౌరవం లేదని అన్నారు. తాను ఉపరాష్ట్రపతిగా వెళ్ళినప్పుడు రకరకాల కధనాలు వచ్చాయని, ఎవరి అభిప్రాయాలు వారివని, తాను ఎన్టీఆర్ నుంచి ఎస్వీఆర్‌లాగా మారానని అన్నారు.

venkayya 19052019

70 ఏళ్ళకు రాజకీయాలను వదిలేసి సమాజ సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇవాల్టితో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయని అన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూడకుండా.. ఎగ్జాట్ పోల్స్ కోసం ఎదురు చూడాలన్నారు. ఎన్నికల సమయంలో సుమారు రోజుకు 16 సభలలో పాల్గోనే వాడినని, ఉపరాష్ట్రపతిగా కూడా తన వంతు ప్రజా సేవకు కృషి చేస్తున్ననని వెంకయ్య నాయుడు అన్నారు. నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధకరమని, రాజకీయ నేతల భాష అసభ్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే తాను ఎన్నికలలో పోటీ చేసేవాడినని, నేటి ఎన్నికలలో కోటానుకోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇంత ఖర్చు పెట్టి మనం ప్రజలకు ఏం న్యాయం చేస్తామని ఆయన ప్రశ్నించారు.

venkayya 19052019

ప్రజా స్వామ్య వ్యవస్థను అవహేలన చేస్తున్నారని, రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపీకలో గుణగణాలు చూడాలన్నారు. ఇవాళ కులం, మతం, ధనమే చూస్తున్నారని విమర్శించారు. ఉచిత పధకాలకు తాను వ్యతిరేకమని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకే మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మంచి అంశాలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాను మొదటి నుంచి కమ్యూనిజం అంటే వ్యతిరేకమని చెప్పారు. కానీ వామపక్ష నాయకులకు ఎనలేని గౌరవం ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read