ఎస్వీబీసీ మాజీ చైర్మెన్ పృధ్వీ వ్యవహారం, గత పది రోజులుగా వార్తల్లో వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా పృధ్వీ రాజధాని రైతుల పై చేసిన కామెంట్స్, తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయి. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హేళన చేస్తున్నట్టే, పృధ్వీ కూడా హేళన చేస్తూ మాట్లాడారు. అందరి లాగే ఉద్యమం చేస్తున్న రైతులని పైడ్ ఆర్టిస్ట్ లతో పోల్చారు. అయితే, ఇంకాస్త ముందుకు వెళ్లి, రైతులు బురదలో ఉండాలి, బురదలో దొరికింది తినాలి అంటూ, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో మహిళా రైతులగా చెప్పుకునేవారికి, బంగారపు గాజులు, మంచి మంచి వాచీలు, బట్టలు ఉన్నాయని, మరి వారు రైతులు ఏమిటి అంటూ, పృధ్వీ వాపోయారు. అయితే ఈ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం రేగింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో, వైసీపీ డిఫెన్స్ లో పడింది. పృధ్వీ పై చర్యలు తీసుకుంటారు అనే వార్తలు వచ్చిన టైంలో, పృధ్వీ సరస సంభాషణ బయట పడటంతో, పృధ్వీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

vk 15012020 2

ఈ నేపధ్యంలోనే, పృధ్వీ ప్రెస్ మీట్ పెట్టి, ఆ ఆడియో అంతా ప్రతిపక్షాల కుట్ర, అది మార్ఫింగ్ అంటూ చెప్పారు. తరువాత, 'ఏపీ 24/7' టీవీ చానెల్ సీఈఓ వెంకటకృష్ణ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట కృష్ణకు వైకుంఠపురంలో తొమ్మిది ఎకరాలు పొలం ఉందని, అలాగే తెలుగుదేశం నేతలు వెంకట కృష్ణకి, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చారని పృధ్వీ ఆరోపణలు చేసారు. పృధ్వీ వ్యాఖ్యల పై స్పందించిన వెంకట కృష్ణ, తీవ్రంగా స్పందించారు. తనకు అమరావతి పరిధిలోని వైకుంఠపురంలో తొమ్మిది ఎకరాల పొలం ఉందని, పృధ్వీ చెప్తున్నారని, అసలు వైకుంఠపురం అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా, నాకు తెలియదని వెంకట కృష్ణ అన్నారు. ఆ భూమి ఎక్కడ ఉందొ పృధ్వీ నిరూపించాలని కోరారు.

vk 15012020 3

ఆ భూమి ఉందని పృధ్వీ నిరూపిస్తే, దాన్ని అనాధ శరణాలయానికి దానం ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. ఇక తనకు తెలుగుదేశం నేతలు, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చారని చెప్తున్నారని, తనకు విజయవాడలో రెంట్ ఇచ్చి, ఉండే ఇల్లు ఉందని, సొంత ఇల్లు లేదని అన్నారు. ఎన్నికల నెల రోజులు ముందు నుంచి, మా ఛానెల్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేసిందని, తమ ఛానెల్ ని టిడిపి బ్యాన్ చేసిందనే విషయం, అందరికీ తెలుసని అన్నారు. తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే, అది పృధ్వీకే ఇస్తానని, ఆ ఫ్లాట్ తను సరస సల్లాపాలకు వాడుకోవచ్చని, ఒక్కో గదిలో ఒక్కొక్కరిని ఉంచుకుని పెట్టుకోవచ్చని అన్నారు. పృధ్వీ తన పై ఎందుకు, ఇలా ఆరోపణలు చేసారో, ఆయనకే తెలియాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read