నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని అడ్డుకోవ‌ద్ద‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి వేడుకుంటోంది. ఇదేంటి కొడుకు పాద‌యాత్ర అడ్డుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తుంటే త‌ల్లి లోకేష్ పాద‌యాత్ర అనుమ‌తి కోసం ఇంత‌లా వేడుకుంటోంద‌నే డౌట్ మీకు రావొచ్చు. విజ‌య‌మ్మ పాద‌యాత్ర గురించి మాట్లాడిన అంశాల‌ను టిడిపి సోష‌ల్మీడియా వెలుగులోకి తెచ్చి వైసీపీని నిల‌దీస్తోంది. నారా లోకేష్ పాద‌యాత్ర‌ని అడ్డుకోవ‌డానికి నానా యాత‌న ప‌డుతోన్న వైసీపీ స‌ర్కారుకి విజ‌య‌మ్మ వీడియో షాక్‌లా త‌గిలింది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌రిప‌డ‌క త‌ల్లితో స‌హా చెల్లి  ష‌ర్మిల తెలంగాణ‌లో సెటిలైంది. అక్క‌డే వైఎస్సార్టీపీ పెట్టుకుంది. ఆమె పాద‌యాత్ర‌ని తెలంగాణ‌ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల కారులో ఉండి నిర‌స‌న తెలిపితే, కారుతో లాక్కుపోయారు. త‌న కుమార్తెని పోలీసులు అలా అరెస్ట్ చేయ‌డంపై విజ‌య ల‌క్ష్మి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  పాద‌యాత్ర‌ల‌ని అడ్డుకున్నట్టు ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వాన్నీ తాను చూడ‌లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించే ప్ర‌భుత్వాలు మంచి ప్ర‌భుత్వాలుగా గుర్తింపు పొందుతాయ‌న్నారు. ఈ వీడియోని టైమ్లీగా బ‌య‌ట‌కు తెచ్చిన టిడిపి శ్రేణులు వైసీపీ పెద్ద‌ల‌ను ఇర‌కాటంలో పెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read