విజయవాడలో పార్కులు ఉండటమే తక్కువ. మూడు నాలుగు పెద్ద పార్కులు తప్ప, చెప్పుకోదగ్గవి ఏమి లేవు. అయితే, ఉన్న పార్కులు కూడా తీసేసి, ఇప్పుడు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. విజయవాడ పాత బస్ స్టాండ్ సమీపంలో, ఫ్లో ఓవర్ పక్కన, అవతార్ పార్క్ ఉంటుంది. అక్కడ కొన్ని ఫౌంటైన్లు కూడా ఉంటూ, ప్రజలు కొంచెం సేపు సేద తీరటానికి అవకాసం ఉండేది. పక్కనే కాలువు ఉండటంతో, ఆహ్లాదకరంగా ఉండేది. అయితే, నిన్న అక్కడకు వచ్చి చూసిన ప్రజలకు, షాక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. అవతార్ పార్క్ లో ఉన్న బొమ్మలు, ఫౌంటైన్ లు పీకి పడేసి ఉన్నాయి. ఎదో ప్రళయం వచ్చినట్టు, అక్కడ వాతావరణం అంతా భీకరంగా ఉంది. అక్కడ ఉన్న రెండు పెద్ద పెద్ద అవతార్ బొమ్మలను, పీకి అవతల పడేసారు. ఈ పార్క్ ను 2009లో మొదలు పెట్టారు.

avatar 17082019 2

అయితే, ఇప్పుడు 10 ఏళ్ళ తరువాత పీకి పడేసారు. 10 సంవత్సరాల క్రితం, రూ.1.20 కోట్ల వ్యయంతో ఈ పార్క్ ను అభివృద్ధి చేసారు. తరువాత కొంత కాలానికి దాదాపుగా 50 లక్షలు పెట్టి, అందమైన మొక్కలు పెట్టి, గ్రీనరీ పెంచారు. మొన్నీ మధ్య కాలంలో, రూ.1.50 కోట్ల అమృత్‌ నిధులతో ఆయా పార్కులకు రెండువైపులా ఫౌంటేన్లు, విద్యుత్తు దీపాలు, జంతువుల బొమ్మలు అమర్చారు. అయితే, ఇప్పుడు ఇక్కడ వాతావరణం అంతా, పూర్తీ భిన్నంగా ఉంది. జేసిబీలు పని చేస్తూ నానా హంగామాగా ఉంది. ప్రజలు వెళ్లి, ఏమి జరుగుతుంది, అసలు ఎందుకు ఇవి పీకారు అని అరా తీస్తే, ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడుతున్నారని, అందుకే ఇక్కడ ఉన్నవి అన్నీ పీకేస్తున్నామని సమాధానం రావటంతో, ప్రజలు అవాక్కయ్యారు.

avatar 17082019 3

నిజానికి ఫ్లై ఓవర్ ఎక్కే చోట, రోడ్డుకి అడ్డంగా, అతి పెద్ద వైఎస్ఆర్ విగ్రహం అక్కడ ఉండేది. పోయిన ప్రభుత్వం, అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అవుతుందని, ఆ విగ్రహం తీసేస్తే ట్రాఫిక్ ఫ్రీ గా వెళ్తుందని, పోలీసులు చెప్పటంతో, ప్రభుత్వం ఆ విగ్రహం అక్కడ నుంచి తీపించి, వైఎస్ఆర్ పార్టీకి అప్పచెప్పింది. అయితే, ఇప్పుడు వైఎయస్ఆర్ కొడుకే అధికారంలోకి రావటంతో, వారి ఇష్టం వచ్చినట్టు చేసే వీలు దొరికింది. మళ్ళీ రోడ్డుకు అడ్డంగా , పోయిన సారి పెట్టిన చోటే పెడితే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, అక్కడ ఉన్న అవతార్ పార్కు పీకి, అక్కడ వైఎస్ఆర్ బొమ్మ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే రేపటి నుంచి అవతార్ బొమ్మలతో ఆడుకోవటానికి పిల్లలు అక్కడకు వెళ్తే, అక్కడ రాజశేఖర్ రెడ్డి బొమ్మ చూసి, అవాక్కయ్యే పరిస్థితి వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read