జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, తమ ప్రభుత్వ విజయంగా చెప్పుకుంటున్నది, వాలంటీర్ ఉద్యోగాల గురించి, అలాగే సచివాలయ ఉద్యోగాల గురించి. వీరికి ఇచ్చిన ఉద్యోగాల గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఇదే సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ వైఖరితో షాక్ తిన్నారు. ఎంతో ఆశతో మొదలు పెట్టిన సచివాలయ ఉద్యోగులు, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో షాక్ తిన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.10 లక్షలకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎక్కవ మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళే. ఇప్పుడు వారికి కొత్తగా ఆఫర్లు వస్తూ ఉండటం, లేకపోతే ఇంకా కొంచెం మంచి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నంలో, వారికి మంచి ఉద్యోగం వచ్చి, వారు ఈ సచివాలయం ఉద్యోగం వదిలెయ్యాలి అంటే, కుదరదు అంటుంది ప్రభుత్వం. ఇంతవరకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం చేసిన ఖర్చు, ఇప్పటి వరకు, మీరు తీసుకున్న జీతం తిరిగి చెల్లించాలని, ప్రభుత్వం అంటుంది.

village 25022020 2

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ సి.మహేశ్వరరెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. దీంతో, సచివాలయ ఉగ్యోగులు అందరూ, ప్రభుత్వానికి ఒక లేఖ రాసారు. ఇదే ఆ లేఖ, "రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయంలో ఉద్యోగం సాధించి, అనతి కాలంలోనే నవశకం, ప్రజా సాధికార సర్వే, రైతు భరోసా, ప్రస్తుతం హౌస్ హోల్డ్ మాపింగ్ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మేము 15,000/- జీతభత్యములతో మా ఇంటిళ్ళపాదిని, మా రవాణా ఖర్చులు అన్ని అందులోనే సరిపెట్టుకుని జగన్నన్న కానుకగా విధులను నిర్వర్తిస్తున్నాము. అయితే ప్రస్తుతంగాని, భవిష్యత్తులోగాని విద్యా, ఉద్యోగ, ఆరోగ్య రీత్యా ఏదైనా కారణాల వల్ల ఉద్యోగం నుండి రాజీనామా చేయవలసి వస్తే, మేము పడ్డ కష్టానికి, ఈ రాష్ట్రానికి మా ఉద్యోగరీత్యా చేసిన సేవలకి గాను పొందిన జీతభత్యాలను తిరిగి వెనుకను చెల్లించుట ఎంతవరకు సమంజసము?"

village 25022020 3

"ఎన్నో పేదరిక, ఆర్థిక, నిరుద్యోగ సమస్యలతో ఈ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగములో విధులు నిర్వర్తిస్తున్న మేము రాజీనామా చేసిన యెడల ఒకేసారి జీతభత్యములు మొత్తము తిరిగి చెల్లించడం వల్ల, మేము తిరిగి అదే పేదరికం లోకి నెట్టివేయబడుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం గ్రామ/వార్డు ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఇలాగే ఈ ఉద్యోగాలతోనే మేము బానిసలుగా బ్రతకవలసిందే అన్నట్లుగా మానసికంగా బాధపడుతున్నాము. ఇప్పుడు రాజీనామా చేసిన పిదప జీతభత్యములు వెనుకకు చెల్లించు ప్రక్రియ వల్ల మాకు మా భవిష్యత్తుపై నమ్మకం పోతుంది. కావున మా ఈ గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మీద నమ్మకము యుంచి గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది యొక్క ఉన్నతిని, అభివృద్ధిని, ఎదుగుదలని కోరుతూ మా యందు దయ యుంచి రాజీనామా తరువాత జీతభత్యములు తిరిగి చెల్లించే ప్రక్రియను రద్దు చేయగలరని మనవి." అంటూ లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read