సొంత పెద‌నాన్న కొడుకు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నాడు. త‌న తండ్రిని చంపిన హంత‌కుల‌కి మ‌ద్దతుగా నిలుస్తున్నాడు. ఆయ‌న‌కి కేంద్రం అండ‌దండ‌లున్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌ని మేనేజ్ చేయ‌డానికి స్వామీజీలు, లాబీయిస్టులు లెక్క‌లేనంత మంది ఉన్నారు. అటువంటి `ప‌వ‌ర్` ఫుల్ వ్య‌క్తిని ఢీకొడుతోంది డాక్ట‌ర్ సునీతారెడ్డి. త‌న తండ్రిని చంపిన హంత‌కుల‌ని చ‌ట్ట ప్ర‌కారం శిక్ష ప‌డాల‌నే ల‌క్ష్యంతో ఎవ‌రి అండ‌దండా లేకుండా ఒంట‌రిపోరాటం చేస్తోంది. అధికారం, డ‌బ్బు, వ్య‌వ‌స్థ‌ల‌ని మేనేజ్ చేసే యంత్రాంగం ఉన్న పెద్ద‌లు ..వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యంలో ఆడుతున్న డ్రామాల‌ని ప‌సిగ‌ట్టేసిన సునీతారెడ్డి...ప‌ట్టువ‌ద‌ల‌కుండా పోరాడుతోంది. పాత్రధారులు ప‌ట్టుబ‌డ్డారు. సూత్ర‌ధారులు అధికారం వెనుక దాక్కున్నారు. వారినీ చ‌ట్టం ముందు నిల‌బెట్టేందుకు సునీతారెడ్డి ఉద్య‌మంలా ఫైట్ చేస్తున్నారు. వైసీపీ క్యాంపులో కీల‌క‌నేత‌లకి ఈ హ‌త్య‌తో సంబంధం ఉండ‌డం, సునీత వైపు న్యాయం ఉండ‌డంతో ఆమె పోరాటాన్ని కుయుక్తుల‌తో ఎదుర్కోవాల‌ని చూస్తున్నారు. చివ‌రికి కుటుంబ‌స‌భ్యుల‌నీ ఒక్కొక్క‌రినీ రంగంలోకి దింపుతున్నారు. వివేకానంద‌రెడ్డి గొడ్డ‌లిపోటు అని ఒక‌సారి, గుండెపోటు అని మ‌రోసారి, ముస్లిం మ‌తంలోకి మారాడ‌ని మ‌రోసారి, రెండోపెళ్లి గొడ‌వ‌లంటూ ఇంకోసారి, వివాహేత‌ర సంభంధాల‌ను అంట‌గ‌ట్టి హ‌త్య‌కేసు నుంచి త‌ప్పించుకోజూశారు. సునీతారెడ్డి ఏ ద‌శ‌లోనూ స‌హ‌నం కోల్పోవ‌డంలేదు. న్యాయ‌పోరాటాన్ని వీడ‌లేదు. వివేకా రెండో భార్య బేగంని త‌న ఇంటికి పిలిపించుకున్నాడు సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి. త‌న సొంత త‌ల్లి, చెల్లిని త‌రిమేసినోడు...బాబాయ్ హ‌త్య‌కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వాడూ అయిన అబ్బాయ్‌..ఈ స‌వ‌తి పిన్నిని ఎందుకు చేర‌దీస్తాడో తెలియ‌నంత అమాయ‌కులు ఏపీలో లేరు. ఆమెని సునీతారెడ్డిపైకి ఉసిగొల్పి తాము బ‌య‌ట‌ప‌డాల‌నే వ్యూహం అమ‌లు చేశారు. అది ఫెయిలైంది. ఇప్పుడు మ‌రో పాత్రని దింపారు. సునీతారెడ్డి మేన‌త్త‌, వైఎస్ వివేకానంద‌రెడ్డి చెల్లెలు విమ‌లారెడ్డిని దింపారు. ఆమె త‌న అన్న మంచోడు అనీ, ఆయ‌న చంపిన వాళ్లు మంచోళ్లు అని స‌ర్టిఫికెట్ ఇస్తోంది. త‌న అన్న కూతురే గ‌బ్బు ప‌ట్టిస్తోంద‌ని చెబుతోందంటే..దీని వెన‌క ఎవ‌రున్నారో ఇట్టే అర్థ‌మైపోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read