ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత వింత పరిస్థితులు చూస్తూ ఉంటాం. అందులో ఒకటి ఏకంగా రైతు పైనే చెప్పు తీసుకుని కొడతాను అంటూ, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పటం. సంక్రాంతి పండగ ముందు వినుకొండలో, ధాన్యం కొనుగులు విషయం పైన, రైతు నరేంద్ర, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని ప్రశ్నించారు. అయితే అది కాస్త వివాదానికి దారి తీసింది. దీంతో ఎమ్మెల్యే చెప్పు తీసుకుని రైతుని కొడతాను అనే వరకు వెళ్ళింది. దీంతో రైతు కూడా నువ్వు కొడితే నేను కొడతాను అంటూ ఎదురు తిరిగారు. అయితే ఈ విషయం పెద్దది అయి, చివరకు మీడియాలో కూడా వచ్చింది. ఎమ్మెల్యే బొల్లా రైతు పైన కేసు పెట్టించారు. ఏకంగా రైతుపైన హ-త్యా-య-త్నం కేసు పెట్టించి, లోపల వేయించారు. అయితే ఈ అంశం పెద్దది అయ్యింది. ప్రతిపక్షాలు ఈ అంశం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. రైతు న్యాయం చేయమని అడిగితే, అతని పైన అక్రమ కేసులు పెడతారా అని ఆందోళన చేసారు. అలాగే అక్కడ వైసీపీలో ఉన్న మరో వర్గం అయిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయ వర్గం కూడా, ఆ అంశం పై ఆందోళన చేసారు. చివరకు విషయం పెద్దది కావటంతో, ప్రభుత్వం కూడా స్పందించింది. రైతు అంశం కావటంతో, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం, ఈ విషయం పై విచారణకు ఆదేశించింది.

vinukonda 17012022 2

అయితే విచారణలో వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ తప్పుడు కేసు పెట్టారని తేలింది. దీంతో వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక్కడ వింత ఏమిటి అంటే, రైతు మాత్రం జైల్లోనే ఉన్నాడు, తప్పుడు కేసు పెట్టిన సిఐ మాత్రం సస్పెండ్ అయ్యాడు. అయితే వినుకొండ ఎమ్మెల్యే జగన్ దగ్గరకు వెళ్లి సిఐ సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరారు. రైతు, మిమ్మల్ని తిట్టాడని, అందుకే అతని పై ఇలా చేయాల్సి వచ్చిందని సమర్ధించారు. దీంతో జగన్ కూడా కరిగిపోయారు. వెంటనే డీజీపీక్కి ఫోన్ చేసారు. సిఐ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. దీంతో వెంటనే సిఐ సస్పెన్షన్ ఎత్తి వేసారు. దీంతో ఇప్పుడు ఈ అంశం ఎమ్మెల్యే బొల్లా vs ఎంపీ శ్రీ కృష్ణదేవరాయగా మారింది. మొత్తానికి మళ్ళీ రైతుదే తప్పు అని తేల్చారు. ఇక్కడ మరోసారి ఎంపీ శ్రీ కృష్ణదేవరాయను సైడ్ చేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో, రోజుల వ్యవధిలో రైతు పైన అక్రమ కేసు పెట్టిన సిఐ సస్పెన్షన్ ఎత్తివేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read