వైసీపీ పాలన పై, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, పధకాల అమలు, అధికారుల పై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వేదికల పై, పబ్లిక్ ఫోరమ్స్ లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎంపీ రఘురామ రాజు ఉన్నారు. మొన్న ఇళ్ళ స్థలాల విషయం పై, లంచాలు అడుగుతున్న విషయాలను ఆయనే స్వయంగా చెప్పారు. తమది మచ్చలేని స్వచ్చమైన పాలన అని, అక్రమాలు లేని పాలన అని ప్రభుత్వ పెద్దలు చెప్తుంటే, సొంత పార్టీ నేతలే, బహిరంగ వేదికల్లో ఎండగడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారింది. తాజాగా గుంటూరు జెడ్పీ సమావేశంలో, గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సొంత ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే, ఇసుక మాఫియా రాష్ట్రంలో చెలరేగిపోతుంది అనే వాదనకు బలం చేకుర్చినట్టు అయ్యింది.

ఆయన జెడ్పీ సమావేశంలో, ఇసుక పాలసీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్క పల్లెటూరులో కూడా కనీసం దోసెడు ఇసుక ఇవ్వలేక పోతున్నామని, కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ సమావేశంలోనే, ఈ విషయాన్ని బయట పెట్టారు. నాడు నేడు కార్యక్రమానికి, కూడా తట్టెడు ఇసుక సప్లై చెయ్యలేక పోయామని, చెప్పేది ఒకటి, వాస్తవంలోకి వచ్చే సరికి, జరుగుతున్నడి ఒకటి అని అధికార పార్టీ ఎమ్మెల్యేనే, తమ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. రీచ్ నుంచి వస్తున్న ఇసుక లారీలు, రీచ్ నుంచి బయలుదేరి, అడిగిన ప్రదేశానికి రాకుండా, మధ్యలోనే మాయం అవుతున్నాయని, ఎవరికీ చెప్పలేక పోతున్నాం అంటూ, తమ పరిస్థితిని స్వయంగా అధికార పార్టీనే ఆవేదన వ్యక్తం చేసారు అంటే, ప్రభుత్వం ఇరుకున పడింది అనే చెప్పాలి. ప్రతిపక్ష నేతల దాడినే తట్టుకోలేక పోతుంటే, ఇప్పుడు అధికార పార్టీలో సొంత నేతలు కూడా, ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నారు. మరి ప్రభుత్వం, ఈ సమస్య పై దృష్టి పెట్టి కరెక్ట్ చేసుకుంటుందో లేక, ఇది చంద్రబాబు కుట్ర, అదే సామాజిక వర్గం, పచ్చ మాఫియా అంటూ, ఎదురు దాడి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read