రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రానికి చేసిన ద్రోహం ఒక వైపు, అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని నాశనం చేస్తున్న తీరు మరో వైపు చూసి, ప్రజలు బీజేపీని చీదరించుకుంటున్నారు. ఇక జీవీఎల్, కన్నా లాంటి వారు మాట్లాడే మాటలతో వాళ్ళకి ఎంత లాభం వస్తుందో కాని, బీజేపీని మాత్రం, ఒక్కో అడుగు పాతాళంలోకి తోక్కిస్తుంది. ఈ క్రమంలో, సొంత పార్టీపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీనైనా ముందుకు వస్తుందా? అంటూ విష్ణుకుమార్‌రాజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారా?... అనే ప్రశ్నకు మాత్రం విష్ణుకుమార్ సమాధానం దాటవేశారు.

vishnu 3101201

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానని వెల్లడించారు. ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తే సరైన కవరేజ్ రాదంటూ ఛమత్కరించారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు సాయం అంశాలపై తెలుగుదేశానికి మైలేజ్ ఇచ్చే అంశంగా పేర్కొన్నారు. డబ్బులిచ్చినప్పుడు సహజంగానే సానుకూలత వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ తరహా నిర్ణయాలు తీసుకోకుంటే రాజకీయ పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. బీజేపీతో కలిసున్నంత వరకు టీడీపీ పాలన బాగానే ఉందని ఆయన చెప్పారు. కానీ విడిపోయాక మాత్రం రాజకీయం తప్ప మరేమీ చేయడం లేదని విమర్శించారు.

vishnu 3101201

దేశంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీపై భారీ స్థాయిలో బురద జల్లింది టీడీపీనేనని స్పష్టంచేశారు. లగడపాటి రాజగోపాల్లా ఏ పార్టీ గెలుస్తుందో తాను ముందే చెప్పలేనన్నారు. పవన్‌కల్యాణ్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఎందుకంటే గతంలో విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అంతగా విమర్శించడం లేదంటే ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే విష్ణు వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరొచ్చని గతంలో ప్రచారం జరిగింది. మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read