మా ఎన్నికల వివాదంలో, వైసీపీ కార్యకర్తలు దూరారు అనే వార్తలు, ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మా ఎన్నికల్లో ఆ వర్గం మీద ఈ వర్గం, ఈ వర్గం మీద ఆ వర్గం దూషణలకు దిగాయి. అయితే, ఎన్నికలు అయిపోవటం, ప్రకాష్ రాజ్ ఓడిపోయి, మంచి విష్ణు గెలవటం, అందరూ ఫోటోలు దిగటంతో, ఇక వివాదం ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే రెండు వర్గాలు ఈ వివాదాన్ని ఇంకా ఇంకా లాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేసారు. సినిమీ ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు, మా ఎన్నికల్లో దూరారని, ఒక వైసిపి కార్యకర్త ఫోటో ఒకటి విడుదల చేసారు. అతనికి ఏమి సంబంధం ఉందని ఎన్నికల ప్రక్రియలో ఉన్నాడని నిలదీసారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు, అలియాస్ సాంబా. జగ్గయ్యపేటకు చెందిన ఈ వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని ప్రకాష్ రాజ్ చెప్తూ, జగన్ మోహన్ రెడ్డితో ఈ రౌడీ షీటర్ ఉన్న ఫోటోలు కూడా విడుదల చేసారు. ఈ విషయం పై ఆయన ఎన్నికల అధికారికి కూడా లేఖలు రాసారు. దీని పై సమాధానం చెప్పాలని కోరారు. తాము అందుకే సిసిటీవీ ఫూటేజ్ మొత్తం ఇవ్వమని కోరుతున్నాం అని, అక్రమాలు జరిగాయాని ప్రకాష్ రాజ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వైసిపి కార్యకర్త విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుడ్ని.

vishnu 24102021 2

ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా విష్ణు ఈ రోజు మరో వీడియో విడుదల చేసారు. ప్రకాష్ రాజ్ ఎవరు అయితే నూకల సాంబశివరావు అనే వ్యక్తి విష్ణు మనిషి అని చెప్తున్నారో, ఈ మనిషి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో ఉన్న వ్యక్తులకు కూడా సాన్నిహితంగా ఉంటున్నాడు అంటూ విష్ణు మరో వీడియో విడుదల చేసి సంచలనానికి తెర లేపారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లిసందడి బృందం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆ బృందంతో ఈ వైసిపి రౌడీ షీటర్ సాంబ కనిపించాడు. ఇదే వీడియోని ఇప్పుడు విష్ణు పోస్ట్ చేసారు. జగన్, మోహన్ బాబు, విష్ణుతో సాంబకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ చెప్పగా, ఇదే సాంబ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో ఉన్నవారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పలని విష్ణు వర్గం అంటుంది. అసలు ఈ వివాదంలో వైసిపి ఎందుకు దూరింది అనే విషయం పై క్లారిటీ రావటం లేదు. ఇదే వైసిపి నేతను ఇప్పుడు విష్ణు కూడా టార్గెట్ చేయటంతో, వైసిపి శ్రేణులు కూడా షాక్ తిన్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉంటూ, వైసిపీ వాడిని పావుగా వాడుకుంటున్నారా అని వైసిపి శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read