జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేక కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కేసు విషయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే శివశంకర్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివేక డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మొత్తం విషయం బయట పడింది. వివేకను ఎలా వేసేసింది, ఎవరు వేయించింది, మొత్తం చెప్పాడు. ఈ విషయం మీడియాలో వచ్చిన నాలుగో రోజే శివశంకర్‌రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ అరెస్ట్ చేసింది. శివశంకర్‌రెడ్డి హాస్పిటల్ లో ఉన్నా సరే, సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత అసెంబ్లీలో ఇదే విషయం పై రచ్చ జరిగింది, చంద్రబాబు ఈ విషయం లేవనెత్తగానే, చంద్రబాబు పై బూతులతో దా-డి చేయటంతో చంద్రబాబు తట్టుకోలేక పోయారు. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మా చిన్నాన్నను మేమే చం-పు-కుం-టా-మా ? దీని వెనుక చంద్రబాబే ఉన్నాడు అంటూ అసెంబ్లీ వేదికగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసారు. అయినా సిబిఐ మాత్రం ఫోకస్ద్ గా ముందుకు వెళ్తుంది.

viveka 29112021 2

అయితే ఈ తరుణంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏకంగా సిబిఐ టార్గెట్ గా ఈ అడుగు పడింది. అంతే కాదు, పోయిన వారం, ఏకంగా వివేక కూతురు అల్లుడు పైన కూడా ఆరోపణలు చేసారు. ఇప్పుడు ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చాడు. సిబిఐ అధికారులు, వివేక అనుచరుల నుంచి తనకు ముప్పు ఉంది అంటూ, అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వివేక హ-త్య తానే చేసానని ఒప్పుకోవాలని, శివశంకర్‌రెడ్డి తనకు పది కోట్లు ఒఫెర్ చేసారని, దీని వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పాలి అంటూ, సిబిఐ అధికారులు తన పైన ఒత్తిడి తెచ్చారని, తనకు డబ్బులు కూడా ఆఫర్ చేసారు అంటూ, ఫిర్యాదు చేసారు. అంతే కాదు తనకు సెక్యూరిటీ కూడా పెంచాలని కోరాడు. ఈ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు శివశంకర్‌రెడ్డి అనుచరుడు. ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఇప్పటికే దస్తగిరి ఒప్పుకున్నాడని సిబిఐ చెప్తుంటే, ఇప్పుడు మళ్ళీ ఇతను చేసాడని సిబిఐ ఎందుకు ఒత్తిడి తెస్తుంది ? ఎందుకు డబ్బులు ఇస్తుంది ? చూద్దాం పోలీసులు ఏమి తెల్చుతారో. ఏకంగా సిబిఐ పైనే ఆరోపణలు కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read