జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన, వైఎస్ వివేకా కేసు, సిబఐకి అప్పచెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం చేసే విచారణ పై తమకు నమ్మకం లేదు, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, ఏకంగా వైఎస్ జగన్ సోదరి, వైఎస్ సునీత హైకోర్టులో పిటీషన్ వెయ్యటం, అలాగే అనుమానితులుగా, వైఎస్ కుటుంబంలో కొంత మందిని చేర్చి, హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత హైకోర్టు విచారణ జరిపి, ఈ కేసుని సిబిఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పై సిబిఐ ఈ నెల నుంచి విచారణ ప్రారంభించింది. గత 12 రోజులుగా పులివెందుల, కడప వేదికగా సిబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏడు గంటల పాటు, వైఎస్ వివేక కూతురు, వైఎస్ సునీత రెడ్డిని, సిబిఐ విచారణ చేసింది. ఆమె నుంచి చాలా వివరాలు సిబిఐ రాబట్టింది. అంతకు ముందు రెండు రోజుల పాటు వైఎస్ వివేక, ఇంటికి వాచ్ మెన్ గా ఉన్న వ్యక్తిని కూడా సిబిఐ విచారణ చేసింది.

అయితే ఈ రోజు అనూహ్యంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు, వైసిపీ నేత, వైసిపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని, సిబిఐ విచారణకు పిలిచింది. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితిడుగా ఉన్నారు. అయితే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలవటం పై, చర్చ జరుగుతుంది. వివేక హత్య జరిగిన సమయంలో, ఉదయం పూట దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి అక్కడకు వెళ్లినట్టు, అక్కడ ఉన్న రక్తపు మరకలు తుడిచి వేయమని, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ప్రోత్సహించినట్టు, గతంలో సిట్ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. గతంలో సిట్ అధికారులు కూడా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని అయుదు రోజులు విచారణ చేసారు. అలాగే సునీత ఇచ్చిన అనుమానితుల జాబితాలో కూడా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ఉన్నారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. గతంలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి నేర చరిత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి సిబిఐ ఏమి రాబడుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read