వైఎస్ వివేకా కేసులో 55వ రోజు సీబీఐ విచారణ జరుపుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ చేస్తుంది. సీబీఐ విచారణకు ఆరుగురు అనుమానితులు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో తుమ్మలపల్లి యురేనియం ఉద్యోగి ఉదయ్ కుమార్‍రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్ధన్‍ ఉన్నారు. వీరిని సీబీఐ ప్రశ్నిస్తుంది. ఇక వీరితో పాటుగా అనంతపురం కు చెందిన హోటల్ మేనేజర్ రాజు కూడా విచారణకు హాజరయ్యారు. అనంతపురంలో రాజు రోడ్డులోని మాచినేని గ్రాండ్ హోటల్, మేనేజర్ రాజు పనిచెస్తున్నార. 2018లో హోటల్‍కు వచ్చిన వ్యక్తుల వివరాలు సీబీఐ అడిగి తెలుసుకుంది. సునీల్ యాదవ్ హోటల్‍కు వెళ్లి ఉంటారనే సమాచారంతో సిబిఐ ఆరా తెస్తుంది. ఇక మరో పక్క, ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్ళారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్‍తో సీబీఐ అధికారులు మాట్లాడారు. రెండేళ్ల కిందట సాక్ష్యాలు తారుమారు చేసిన ముగ్గురు నిందితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు నిందితుల వివరాలు, నివేదికను సీబీఐ కోరింది. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది మాత్రం బయటకు తెలియదు. గత వారం రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తరువాత, ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ, ముందుకు సాగుతుంది.

cbi 31072021 2

ఇది ఇలా ఉంటే, వివేకా కేసులో తనను వేధిస్తున్నారని సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసారు. సునీల్ కుమార్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో సీబీఐ కౌంటర్ వేస్తూ, కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. సునీల్ కుమార్ యాదవ్‍ను నిబంధనల మేరకు విచారిస్తున్నామన్న సీబీఐ, సునీల్ యాదవ్‍కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.ఆధారాలను ఇప్పుడే బయట పెట్టలేమని సీబీఐ కోర్టుకు చెప్పింది. వివేకా హత్య ముందు, తర్వాత సునీల్ కుమార్ వ్యవహార శైలిపై అనుమానాలు ఉన్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. అయితే కీలక అనుమానితుడుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ పరారీలో ఉండటంతో, అతని కోసం సీబీఐ ముమ్మర గాలింపు చేస్తుంది. ఇప్పటికే సునీల్ సమీప బంధువు యువరాజ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో తిరుగుతూ విచారణ సీబీఐ జరుపుతుంది. పులివెందులలో పది రోజులుగా సునీల్ ఇంటికి తాళం వేసి ఉండటం, కుటుంబం కూడా కనిపించుకుండా పోవటంతో, సిబిఐ ముమ్మర గాలింపు చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read