మాజీ మంత్రి, జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో సిబిఐ అధికారుల విచారణ దాదపుగా 100వ రోజుకి చేరుకుంది. ఇప్పటి వరకు సిబిఐ అధికారులు, బిగ్ షాట్స్ వరకు అరెస్ట్ ల వరకు వెళ్ళలేదు. ఇప్పటికే ఒకే ఒక అరెస్ట్ జరిగింది. సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. అయితే ఇప్పుడు సిబిఐ అధికారులు మరొక అరెస్ట్ చేసారు. పులివెందులలో గజ్జల ఉమాశంకర్‌రెడ్డి అనే వ్యక్తిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారు. అంతే కాదు వెంటనే ఆయన్ను పులివెందుల కోర్టులో కూడా హాజరు పరిచారు. కోర్టు గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ గజ్జల ఉమాశంకర్‌రెడ్డి అనే వ్యక్తి, కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన వ్యక్తి. వివేక కేసులో ఇతను కీలక వ్యక్తిగా సిబిఐ భావించి అరెస్ట్ చేసింది. ఇతన్ని అరెస్ట్ చేయటానికి ముందు, సిబిఐ ఇతని గురించి సమాచారం సేకరించింది. ముఖ్యంగా ఇప్పటికే సిబిఐ అధికారులు సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతన్ని పది రోజుల పాటు కష్టడీలోకి తీసుకుని విచారణ చేసారు. కస్టడీకి తీసుకున్న సమయంలోనే సిబిఐ అధికారులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు చెప్తున్నారు. సునీల్ యాదవ్ విచారణ తరువాత, రంగయ్య, దస్తగిరిలకు సంబంధించిన స్తేమేంట్ ని కూడా రికార్డ్ చేపించారు.

cbi 11092021 2

అయితే సునీల్ యదావ్ ఇచ్చిన సమాచారంతోనే, ఉమాశంకర్‌రెడ్డిని సిబిఐ విచారణ చేసింది. ఉమాశంకర్‌రెడ్డిని చాలా సేపు విచారణ చేసిన అనంతరం, అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసారు. వెంటనే పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ విధించటంతో, కడప జైలుకు తరలించారు. ఇది ఇలా ఉంటే ఉమాశంకర్‌రెడ్డి పాత్ర పై, సునీల్ తో పాటు, దస్తగిరి కూడా కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి కలిసి వివేక ఇంట్లో కుక్కని అంతకు ముందే కారుతో గుద్ది చం-పా-రు. ఆ తరువాత వివేక హ-త్య జరిగిన రోజు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి కలిసి బైక్ మీద వచ్చారు, పని ముగిసిన తరువాత, ఉమాశంకర్‌రెడ్డి గొ-డ్డ-లి తీసుకుని బైక్ పై వెళ్ళిపోయినట్టు సిబిఐ గుర్తించింది. దీంతో ఇప్పుడు ఆ బైక్ తో పాటుగా, గొ-డ్డ-లి-ని కూడా సిబిఐ స్వాధీన పరుచుకునే ప్రక్రియలో ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఉమాశంకర్‌రెడ్డికి సంబంధించి, ఫోరెన్సిక్‌ నివేదికలను కూడా సిబిఐ తెప్పించుకుంది. చేసిన వారు దొరుకుతున్నారు కాబట్టి, ఇప్పుడు చేపించిన వారి వరకు సిబిఐ వెళ్తుందా, లేదా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read