విశాఖలో దాదాపు 300 విలువైన కోట్ల భూమిని, కొంతమంది ప్రబుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని సమాచారం. సాధారణంగా టూరిజం ప్రాజెక్ట్లు ఏదైనా జరిగేటప్పుడు ముందుగా సమాచారం అందుతుంది. కాని ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్లో ,స్థానికంగా ఉన్నటువంటి వారికి గాని, ఎవరికీ తెలియకుండా, పూర్తి స్థాయిలో అమరావతి నుంచే ఫైల్ ను మూవ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఏవైతే రెండు సంస్థలు ఉన్నాయో ఈ రెండు సంస్థ లకు కలిపి సుమారుగా 22 ఎకరాలు, ఒకటేమో గుడ్లవాని పాలెం, మరొకటి రామా నాయుడు స్టూడియోస్ ఎదురుంగా ఉన్నఇంకొక స్థలాన్ని వీళ్ళకు కేటాయించటం జరిగింది. ఈ రెండు సంస్థలకు కూడా కేటాయించిన స్థలం పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కుచెందింది.ఈ ప్రదేశం లో బీచ్ రిసార్ట్స్ ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా ఈ రెండు సంస్థలు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రబుత్వం మాత్రం దీనిని సమర్ధించుకుంటుంది. ఈ స్థలాలను టూరిజం హబ్ గ తీర్చి దిద్దుతామని బయటకు చెబుతున్నారు. కాని దీని వెనుక భారీ స్కాం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా బీచ్ కు ఆనుకున్నటు వంటి స్థలాలను ఇవ్వాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్ని సర్వేలు చేసి రిపోర్ట్ ను తయారు చేయాలి.

vizag 21012022 2

అయితే ఈ రిపోర్ట్ మాత్రం ఎలాంటి అబ్జేక్షన్స్ లేక పోవటంతో అందరికి అనుమానం కలుగుతుంది. ఇందులో ఉన్నటువంటి రెండు సంస్థలు ఒకటి, మేరైన్ రీజో, జూ వెనుకాల ఉన్నటువంటి 3 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తుంది. దీనికి సుమారుగా 10 కోట్లు పెడుతునట్లు సమాచారం. అయితే ఇంకో సంస్థ దాదాపు ౩౦౦ కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు బీచ్ ప్రాంతంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ లు జరగలేదని చెబుతున్నారు. పెట్టుబడులు పెడతాం, ఉపాధి ఇస్తాం అని చాలా కంపెనీలు ఇది వరుకే వచ్చినా, అక్కడ ఎలాంటి క్లియరెన్స్ లు లేకపోవటంతో, ఎవరికీ అవకాసం ఇవ్వలేదు. అయితే ఇప్పటి ప్రభుత్వం పెద్దలు మాత్రం, పావులు కదిపారు. బీచ్ రిసార్ట్స్ భారీగా కడతాం అని, అక్కడ ప్రైవేటు భూమి లేదు కాబట్టే,ప్రభుత్వ భూమి కావాలని అడుగుతున్నామని అంటున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం, ప్రభుత్వమే ప్రతిపాదనలను కేంద్రానికి పంపటం వెనుక, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read