విశాఖపట్నం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక రాజధాని.. ప్రశాంతమైన సిటీ. ఎంతో అద్భుతంగా ఉండే పర్యాటక సిటీ. హూద్ హూద్ వచ్చి విలయతాండవం చేసినా, వెంటనే కోలుకుని, మళ్ళీ పూర్వ వైభవం పొండింది. ఇలాంటి అద్భుతమైన, ప్రశాంతమైన సిటీ పై, విశాఖ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. క్రైస్తవులపైనా, చర్చిలపైనా దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి, చర్చిల దగ్గర బందోబస్తు పెంచండి, వాటికి రక్షణ కలిపించండి, అంతే కాదు నెలకు ఒకసారి, అసిస్టెంట్‌ కమిషనర్‌లు తమ పరిధిలోని అన్ని చర్చలకు వెళ్లి భద్రత ఎలా ఉందొ సమీక్ష చెయ్యాలని, ఎక్కడా దాడులు లేకుండా చూడాలని, విశాఖపట్నం నగర మేయర్ ఆర్కే మీనా కీలక ఆదేశాలు జారీ చేసారు.

vizag 18072019 2

అయితే పోలీస్ కమీషనర్ ఇచ్చిన ఈ ఆదేశాలు చర్చనీయంసం అయ్యాయి. ఇప్పటిదాకా విశాఖపట్నంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఒక్క చర్చి పైన కాని, ఒక్క క్రీస్టియన్ సోదరుడు పై కాని ఎలాంటి దాడులు జరగలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ నగరానికి ఆ చరిత్ర ఎప్పుడూ లేదని అంటున్నారు. అసలు మన రాష్ట్రంలోనే గత కొన్నేళ్ళుగా మత ఘర్షణలు లేవని, మరి అలాంటప్పుడు, ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చారా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు పోలీసులు ఇలా చేసారని ఆరా తియ్యగా, స్పందన కార్యక్రమంలో, డేనియల్‌ శ్యామ్‌ అనే ఒక వ్యక్తి, ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా, ఈ నెల 4వ తేదిన విశాఖ పోలీస్ కమీషనర్ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

vizag 18072019 3

పోలీస్ బాస్ నుంచే ఆదేశాలు రావటంతో, పోలీసులు కూడా చర్చిల దగ్గర పహారా పెంచారు. చర్చిలకు దగ్గర ఉండే, వీహెచ్పీ, బీజేపీ వారి పై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండటంతో, ఏమి జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. ఏ కారణం లేకుండా, ఎవరో ఒక అనామకుడు ఇచ్చిన వినతితో, అతను ఎవరూ, బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూడకుండా, ఇలా చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని, చర్చిలు కడుతూ ఉండటంతో, వారి పై ఆందోళనలు చెయ్యకుండా, ఇలా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారులు మాత్రం, శ్రీలంకలో జరిగిన దాడులు తరువాత, అప్రమత్తం అయ్యామని చెప్తున్నారు. అయితే, అది జరిగి మూడు నెలలు అవుతుందని, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడితో ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల్లో అపోహలు సృస్టించకుండ, గుడిలు, మసీదులు వద్ద కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read