రాజధానిని విశాఖ తీసుకు వెళ్తాను అని చెప్తున్న ప్రభుత్వం, అక్కడ గతంలో కేటాయించిన ప్రణాళికను పక్కన పెట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో విశాఖలో, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టటానికి ప్రణాలికలు రూపొందించారు. అయితే ఇప్పుడు ఆ భూమిని రద్దు చేసి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా, ఆ భూమిని ఇళ్ళ పట్టాల కింద ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశాఖ వాసులు షాక్ తిన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం, త్వరలోనే మరో చోట భూమి చూసి, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ వచ్చేలా చూస్తామని ప్రకటన చేసింది. ముధురవాడలో కానీ, భీమిలిలో కానీ, భూమి లభ్యత చూసి, అక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామని చెప్తున్నారు. అయితే ఒకసారి రద్దు అయిన తరువాత, అదీ భూమి కేటాయించిన ప్రాజెక్ట్, మళ్ళీ వేరే చోట రావటం అంటే ఎంతో కష్టం. గతంలో విశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, అమరావతికి ధీటుగా విశాఖను తయారు చెయ్యాలని తలిచింది.

ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, 150 ఎకరాల్లో తేవటానికి ప్రణాళికలు రచించింది. గతంలో హైదరాబాద్ లో ఎలా అయితే గచ్చిబౌలిని నిర్మాణం చేసారో, అలాగే విశాఖలో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను చెయ్యాలని అనుకున్నారు. దీని కోసం 80 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ కు అగనంపూడిలో ఇచ్చారు కూడా. మిగతా 70 ఎకరాలు సేకరించి, ఈ ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటే, గతంలో ఇచ్చిన 80 ఎకరాలు కూడా రద్దు చేసి, ఇళ్ళ పట్టాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో అటు విశాఖ వాసులే కాకుండా, రాష్ట్రంలో క్రీడా ప్రేమికులు అందరూ నిరుత్సాహపడుతున్నారు. అసలకే మన రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహం తక్కువ. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ గాండీవ లాంటివి మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు క్రీడల గురించి పట్టించుకోకుండా, ఇలా ఇళ్ళ పట్టాలకు ఆ భూమి ఇవ్వటంతో, క్రీడా ప్రేమికులు నిరుత్సాహపడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా తొందరగా వేరే చోట భూమి కేటాయించాలని, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read