రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను, ప్రజలకు దగ్గర చెయ్యటానికి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 4 లక్షలు అని చెప్పినా, 2.5 లక్షల మందినే ఇప్పటి వరకు తీసుకున్నారు. అయితే, వీరు కూడా ఎక్కువ మంది, వైసీపీ కార్యకర్తలే అనే వాదన కూడా వచ్చింది. పలు సందర్భాల్లో వాలంటీర్ల తీరు కూడా వివాదస్పదం అయ్యింది. ఇప్పటి వరకు, వీరు గ్రామల్లో పెన్షన్లు, రేషన్ కార్డులు లాంటి సేవలు అందిస్తున్నారు. రేషన్ ఇంటికి తెచ్చి ఇవ్వటం మాత్రం మొదలు అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా, పెన్షన్లు తీసి వేయటం, రేషన్ కార్డ్ లు తీసివేయటం పై కూడా వాలంటర్ల పైనే విమర్శలు వస్తున్నాయి. అయితే వాలంటీర్లు మాత్రం, అవి మాకు సంబంధం లేదని, పై స్థాయిలో, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పోతున్నాయి అని చెప్తున్నారు. ఇలా వాలంటీర్ల పై, ఒక పక్క విమర్శలు వస్తున్న వేళ, ప్రభుత్వం మాత్రం, వాలంటీర్లే మా ప్రభుత్వానికి బలం అని, అన్ని పధకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది వారే అని చెప్తున్నారు.

volunteers 26022020 2

అయితే ఒక పక్క ఈ విమర్శలు, ప్రభుత్వం వారిని సమర్ధించటం కొనసాగుతూ ఉండగానే, ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో, తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ రోజు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరగబోయే పరీక్షల విషయం పై మాట్లాడారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని, మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని ఆయన చెప్పారు. అయితే, ఈ పరీక్షలకు, గ్రామ, వార్డు వలంటీర్లను ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వం పెడుతుంది అంటూ, వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రకటనతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఈ ప్రకటన, లైవ్ లో చూసి విన్న వారు, ఇదేమీ నిర్ణయం అంటూ, ఒకేసారి షాక్ కు గురయ్యారు.

volunteers 26022020 3

ఇంటర్, 10th లాంటి పరీక్షలు పిల్లల జీవితాల్లో ఎంతో కీలకం అని, ఆ పరీక్షలు రాసే సమయంలో, వచ్చే ఇన్విజిలేటర్లు తీరు, వారి పరీక్ష పై ప్రభావం చూపుతుందని, వారి పేపర్లు తీసుకోవటం, పరీక్షా విధానం, ఓఎంఆర్ షీట్లు, ఇలా ప్రతి విషయంలో ఇన్విజిలేటర్లు జాగ్రత్తగా ఉండాలని, చాలా అనుభవం ఉన్న టీచర్లే ఒక్కోసారి పొరపాటు చేస్తారని, ఇలాంటి కీలకమైన చోట, వాలంటీర్లను, ఇన్విజిలేటర్లుగా పెట్టటం పై, తీవ్ర అభ్యంతరం ఎదురు అవుతుంది. ఇప్పుడు ఇన్విజిలేటర్లు అంటున్నారని, రేపు పరీక్షా పేపర్లు కూడా దిద్దిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు అందరూ, చాలా వరకు 23 నుంచి 25 ఏళ్ళ లోపు వారని, వాళ్ళకు ఇలాంటి కీలక బాధ్యతలు ఎలా ఇస్తారంటూ, సర్వత్రా విమర్శలు ఎదురు అవుతున్నాయి. వారి పని వారు సవ్యంగా చేసేలా చెయ్యకుండా, ఇలాంటి కీలక బాధ్యతలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read