ఎంపిటిసి, జెడ్పీటీసి ఎన్నికలు గురువారం జరుగగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం 60 కి పడిపోయింది. ఈ క్రమంలో అధికార వైసిపి పార్టీ పోలింగ్ శాతం ఎందుకు తగ్గిందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్ని పధకాలు పెట్టారు, ప్రజలు 95 శాతం మా వైపే ఉన్నారు అంటూ ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ ఫిగర్ చూసి, ఆలోచనలు పడ్డారు. అయితే ఓటింగ్ ఇంతలా పడిపోవటానికి, చంద్రబాబు మాట ప్రజలు విన్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, ఈ పరిషత్ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తుందని ప్రకటించారు. అయితే కొంతమంది అభ్యర్ధులు మాత్రం కొన్ని చోట్ల పోటీలో ఉన్నారు. సామాన్య ప్రజలతో పాటుగా, టిడిపికి చెందిన ఓటర్లలో మెజార్టీ ఓటర్లు ఓటు వేయడానికి ఇష్టపడకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీనివల్లే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిందని తెలుస్తుంది. అయితే పోలింగ్ శాతం ఎంత తక్కువగా ఉంటే అంతగా తమ పార్టీ అభ్యర్థులకు మేలు జరుగుతుందని అధికార పార్టీ భావిస్తుంది. తాము టిడిపిని ఆదినుండి ఆదరించాం కాబట్టి ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు తాము ఓటేయ్యడానికి వెళ్లలేదని పలువురు ఓటర్లు వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ప్రభావం వల్లనే పోలింగ్ శాతం తగ్గిందని, అయితే టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్న చోట మాత్రం ఆయా గ్రామాల్లో 75 నుండి 80 శాతం వరకూ కూడా పోలింగ్ జరిగిందని తెలిసిందే.

voting 10042021 2

ఇదలా ఉంచితే టిడిపికి ఇంకా కొన్ని గ్రామాల్లో పట్టుందని ఈ పరిషత్ ఎన్నికలు నిరూపించాయి. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించి పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రాంతాల్లో ఓటర్లు సాయంత్రం ఐదు దాటినా క్యూ లైనులో నిలబడి ఉన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో టిడిపి అభ్యర్ధులు గట్టిగానే పని చేసారు. వీరిని చూసి అధికార పార్టీ కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల్లో మరింతగా తమ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని, అసలు టిడిపి ఎందుకు ఎన్నికలు బహిష్కరించింది అనే విషయం పై ప్రజల్లో చర్చ జరిగింది, దాని ఫలితమే ఇంత తక్కువ పోలింగ్ అని అంటున్నారు. ఇక మరో విషయం ఏమిటి అంటే, సహజంగా గ్రామాల్లో ఓటింగ్ భారీ స్థాయిలో ఉంటుంది. ఇంకా మూడేళ్ళు పైగా అధికారం ఉండటంతో, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తారు. అయితే ఈ సహజ ధోరణికి భిన్నంగా, ఈ సారి ఓటింగ్ లో పాల్గునటానికి ఆసక్తి చూపలేదు. గతంలో 2014లో 83 శాతం వరకు ఓటింగ్ జరగగా, ఇప్పుడు కేవలం 60 శాతానికి పరిమితం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read